Like-o-Meter
[Total: 0 Average: 0]
నీలా నవ్వే నవ్వును
నన్ను నవ్వించమని
నవ్వుతూ నేనడిగితే
ఆ నవ్వు నవ్వుకుని
నవ్వుతూ నాతో
నవ్వులనే నవ్వించే నవ్వుతో
నీలో ఆమె నవ్వుతూ ఉంటే
నాతో ఈ నవ్వులాట ఎందుకని
నవ్వుతూ వెళ్ళిపోయింది.
******
చుక్కలున్న రాతిరి
వెతికితే గానీ చుక్క కనపడని రాతిరి
ఎలా అయిందబ్బా
మనసున్న వాడి మనసు మనసుపడి
మనసైనదాని మనసుతో
మనసు విప్పి మనోల్లాసంగా మాట్లాడితే
ఇలా ఇలా కాక ఎలా ఉంటుంది నాతో
చెలి కన్నుల వెన్నెల.
*********