Like-o-Meter
[Total: 1 Average: 5]
1
వొరుగుతున్న
కాంతి కిరణపు అంచుల్మీంచి
ఎండు ఆకుల గలగలలు-
2
క్షణక్షణానికి జారిపోతూ
విడిచేసిన కుబుసం గాలికి కొట్టుకొనిపోతూ-
చీకటి గుహలో
నీలి పక్షి దారి చూపమంటూ
3
చెదలు
పడుతోంది-
ఇక ఈచెట్టు
ఎంత మాత్రమూ సురక్షితం కాదు-
4
చాలాసేపటి నీంచి
దిగుడు బావి లోంచి విన్ఫిస్తోన్న దాహపు
అలసిన నిట్టూర్పుల్ని మింగిన నిశ్శబ్దం-
####