నిద్రితులు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కలలు విప్పుకుంటూ…

కళ్ళు తెరుస్తూ…

సిగ్గొదిలేసిన చీకటి

వస్త్రాలన్నీ విసర్జించింది.

 

వెలుగు తెర మీద

అందరూ నాలాగే

రహస్య నిద్రలో

నగ్నంగా…

మరింత విస్మయంగా!

 

వెంటాడే

వెలుతురు చినుకులమధ్య

ఆవలితీరానికి పరుగులిడుతూ

ఒంటరి ఆత్మల

సమూహాలు!

 

ఆకులన్నీ రాల్చేసిన

ఆ చెట్టు మాత్రం

హాయిగా నిలబడే ఉంది!

 

Your views are valuable to us!