నిజం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

నిజం ఏమిటో
 

నీ నీడకు తెలుసు గనుకే

అదెప్పుడూ


మట్టినంటి పెట్టుకునే ఉంటుంది.

      *******

అంతటి ఘోష వెనకున్నా

తన మూగభావాలను
 

వినిపించాలన్న తన కోరిక

ఇప్పటికి తీరిందంటూ

నా చెవిలో ఎంత హాయిగా పాడుతోందో

చూడా శంఖం.

       *******

నిరీక్షించే కళ్ళకెపుడూ

కన్నీళ్ళే బహుమానం


ఐతే అలా లేకపోతే ఇలా.

       *******

Your views are valuable to us!