Like-o-Meter
[Total: 0 Average: 0]
శీతగాలితో బాధ ఒకటి ఊసులాడిన
నిన్నటి రోజు ఎందుకలా గడిచింది?
ఎండపొడ గిట్టని మనసు
తడిలేని కళ్ళతో ఏమిటా సైగలు?
ఇంకా నిద్రపోతున్న గుబులుకు
మేలుకొలుపు పాడుతున్నట్టు ఎవరిదా గొంతు?
కదల్లేని గడియారం
కాలాన్ని కదిలించేస్తోంది.
పద!
ఒకటో అరో అక్షరాల్ని
రక్తనాళాల్లోకి ఎక్కించుకుందాం.
ఆ స్పర్శతో
ఈ గుండెదడ తగ్గొచ్చు!
(‘అక్షరం’ అఫ్సర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో)