ఒక సంగీతం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

 

ఓప లేని ఈ తాపం
చేయమంది తీయని పాపం
దప్పికతో వున్న దేహం
తీర్చమంది తన దాహం

వయసు వెల్లువైన వేళ
మనసు మైమరచిన వేళ
చిన్నదాని కళ్ళల్లో
కోరిక కనిపించిన వేళ
చిన్నవాడి గుండెల్లో
మోహం మోలకెత్తిన వేళ

అరవిరిసిన మల్లెలే
పానుపైన వేళ
ఒకరి పెదవులొకరికి
అమృతమ్ములైన వేళ

గాఢ పరిష్వంగమే
బంధమైన వేళ
అలసిన యిరు తనువులకి
చెమట గంధమైన వేళ

కొత్త జంట వైనం చూసి
మన్మధుడే మురిసిన వేళ
బొసి బొసి నవ్వులేవొ
ఊహల్లో మెదిలిన వేళ

కొత్త జీవి జాతకం
పరబ్రహ్మ రాసిన వేళ
జగమేలే ఆ విష్ణువే
ఆశీర్వదించిన వేళ…

Your views are valuable to us!