Like-o-Meter
[Total: 0 Average: 0]
పండుటాకు
అడవి పండుటాకుకైనా
అడవి పండుటాకుకైనా
ఎంత వైభోగానిస్తుందో చూడు
ఇప్పటి దాకా ఊయలూపి
ఆ గాలి పల్లకీలో మోసుకొచ్చి
సెలయేటిలో ఊరేగిస్తోంది
మరి నీవో……..?
*********
పరమార్ధం
పోగు చేసి పోగు చేసి
చివరకు పరమార్ధం అర్ధమై
చినుకు చినుకును పంచుతూ
తాను కరిగిందా కారుమేఘం.
***********
మనసు
గల గలా నవ్వుతూ
గోదారిలా నన్ను చేర వచ్చేవు
కడలిలా ఎనలేని సంపద లేదు నాకు
నిన్ను పొదువుకునే
మౌక్తికమంటి మనసు తప్ప.
***********
ఏకసంథాగ్రాహి
ఒక్క సారి వింటూనే
నా పాఠం నాకే ఒప్పచెప్పేస్తుంది
ఈ కొండ.
***********