Like-o-Meter
[Total: 0 Average: 0]
పసిపాప
ఊగే ఊయల ఆగిపోయిందని
మేలుకున్న పసిపాప
నా స్వప్నం.
******
పాదుక
మీదెక్కి నాడు
మీద పడుతూ నేడు
పాలనకు ప్రతీక అయింది
ఆ పాదుక.
******
రక్తదానం
జలగలూ
రక్తదానం చేస్తాయోయ్
పంచవత్సర వసంతోత్సవాన.
********
విధి
తనను ధిక్కరించే
ఆ చీకటి హక్కును గౌరవిస్తూ
తన విధినెంత అందంగా నిర్వర్తిస్తోందో
చూడా దీపం.
******
జీవితం
పొత్తిలి పిడికిలి
అంతే!
జీవితమంటే.
******