పిచ్చిలో….

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

నేనో పిచ్చిమొక్కని
రోడ్డు పక్కో, సగం కూలిన గోడ సందులోనో పుట్టుకొస్తా

నాలాంటిదే పిచ్చిగాలి
కొంచెం జోరుగా, కొంచెం తూలినట్లుగా వీస్తాది
నేనూ ఊగుతా

నా ఒంటరితనం మాయమైపోవడం ఇష్టంలేని
చెయ్యొక్కటి నా గొంతును నులుముతుంది

గాలి పిచ్చితోటి నా తల
ఆ చేతిలో ఊగుతానే ఉంటది

Your views are valuable to us!