Like-o-Meter
[Total: 1 Average: 5]
చెప్పాపెట్టకుండా
వొకానొక సూదంటు ముల్లు
లోన లోలోన
మరీ లోలోని లోతుల్లోకి
గుచ్చుతూ గుర్తు చేస్తోంటోంది!
పిల్లల బొమ్మల అంగట్లో
ప్రతి బొమ్మ స్పర్శలోనూ
చేతివేళ్ళు కాలినంత జలదరింపు!
అలిగిపోయిన
తన ఆత్మ తనంతటనే తిరిగివొచ్చి
గడప గొళ్ళెం తట్టి
“నేనొచ్చాను నీ కోసం” అన్న
పిలుపు వినేవరకూ
కనిపించే ప్రతి శిశువు బేలకన్నుల్లో
శిశువై కరిగిపోతూన్న
ప్రతిరాత్రీ నిర్నిద్రలోని కలవరింత….