పల్లవి: ఏమైందే నీకు ఓ మనసా, మారిందిలా నీ వరసా
కన్నుల ముందుకొస్తే కలలు గన్న అప్సరస
మిన్నులకెగసింది నీ శ్వాస
చరణం: పున్నమి నాటి వెన్నెల పొంగును, కొంగున గట్టి
ఆశలు రేపే మల్లెలు కొప్పున చుట్టి
నడుమొంపున నా చూపుల తీగలు నాజుకుగ కట్టి
మ్రోగే వీణియ తానంటూ
విరిసిన హరివిల్లులు తన చెలులంటూ
కదిలే వెన్నెల గోదారిలా, కవ్వించే వలపుల దేవేరిలా
అందంగా ఆమె ఇటు వస్తుంటే ll ఏమైపోయిందే ll
చరణం: కోహినూరు కాంతులన్ని ఒక్కచోట కొలువుదీరి
తనను కొలిచే దారి చూపమంటూ
నా గుండె తలుపులే తడుతూ ఉంటే
పలుకులెన్నో నేర్చుకొచ్చి, కొత్త పాటలాగా వాని కూర్చి
తనను గూర్చి కోకిలమ్మ చేస్తుంటే! కచ్చేరి
నడిచే కోవెలై నవ్వే జాబిలై
ఆ తెలుగింటి అలివేణి, నా వలపంటి విరిబోణి
ఓర చూపుల నారి సారిస్తే నీ వైపు ll ఏమైపోయిందే ll
**********