పల్లవి: నింగిని విడిచా చినుకు
జారే పథాన ఎగసి
పల్లవి పాడెను మనసు
అణిగిన ఆశలు రేగి
నవ్వే ఏటికి మల్లె
అల్లరి చేసెను వయసు
చరణం: పొంగిన హృదయమే
చినుకుకు స్వరమై
చిటపట పాటలే
పుడమికి సర్వమై
సాగేటి రాగాల హేలలో
వినిపించు ఆనంద రవళిలో
తనువే విరిసే బృందావనిలా
మనసే ఆడెను మందాకినిలా
చరణం: అనుభవ సాగరం
అయ్యే మానసం
గురుతుల విల్లులే
రాసెను చినుకులే
గాంధర్వ గానాల మధురిమతో
మన్నింటి మత్తైన పిలుపులతో
ముంగిలికొచ్చే మయూరాంగనై
చేతననిచ్చే జీవనాదమే
చరణం: తెమ్మెర పిలుపులే
రమ్మని లేఖలై
తలుపుల వెనకాల
తలపులు పూయించె
మురిపాల మువ్వలా సవ్వడితో
ఊరేగే పరువాల పల్లకిలో
మనసే తనుగా మందహాసాన
మరులే కురిసే నందనవనాల.
******