పల్లవి: జానెడంత చోటులో ఎగరని, జయకేతనం! సాక్షిగా
ఎర్రబడిన కళ్ళలో పొంగుతున్న సాగరం! సాక్షిగా
ఎక్కడ వెలిగిపోతోంది, నా భారతం
వేదనతో కుములుతుంటే నా తరం ll ఎక్కడ 2 సా ll
చరణం: అంధుడైన ప్రభువు ఒక్కడు కాడిప్పుడు
నూరుగురైన వాడి వారసులు నూరు లక్షలిపుడు
నిండు సభలో నాటి ఆడదాని దైన్యం
నడి రోడ్డుకు నేడు చేరిన వైనం
ముందుకే పోతున్నామా మనమంటూ
అడుగుతున్న పసి మానం
ఎందుకు కాలేక పోతోందో! ఆసేతుహిమాచలాన్ని
అదిలించే అంకుశం
చరణం: కోటి ఊటల మాటలిక్కడ
కోటి కాసుల మూటలక్కడ
ఉన్నదంత ఊడ్చేసే నేర్పు
ఆ నేతకు నేర్పింది నీ ఓర్పు
అని అంటుంటే డెమోక్రసీ
ఎప్పుడొస్తుంది భాయీ నీలో కసి
ఏ లోటు లేదు నాకు ఏ చేటు రాదు నాకు
అంతమైపోయింది నా వెతల కురుక్షేత్రమంటూ
యుగాంతానికైనా నినదించగలవా నువ్వు ఓ భారతీయుడా.
******