Like-o-Meter
[Total: 0 Average: 0]
మబ్బు తొలిగింది
మంచు కురిసింది
ఆకు రాలింది
అగ్ని రాజుకుంది
అలసట మొదలైంది
వాన కోసమై మరల
వనం వేసారింది
జనం వేడుకొంది
చినుకు పడింది
చిరు ఆశ చిగురించింది
చార చార కాల చక్రం కదలుతోంది.
మనుషులు మారలేదు
కాదు…
మనుషులు మరలు అమర్చుకున్నారు
మనసుని మాయా ప్రపంచానికి వదిలేసారు
అయినా ఆత్మ ఘోష ఆగలేదు
ఆరాటం తీరలేదు
ప్రతి రోజూ ఇదే తంతు
కాలంలో పడిపోయే తనవంతూ
వస్తుందని తెలిసీ తెలియని తరహాలో !