Like-o-Meter
[Total: 0 Average: 0]
తెలుగమ్మాయి
చక్కనైన అమ్మాయి మన తెలుగమ్మాయి,
చామంతి పూలను జడలో తురిమి,
చిక్కిన నడుముకు,
చీరను కట్టి,
చుక్కల రవికను సింగారించి,
చూడముచ్చటగా వచ్చింది తెలుగమ్మాయి,
చ్రు రేఖా చిత్రంలా.
చెంపల విరిసిన సిగ్గుల కెంపులు
చేతిలో పూసిన గోరింటాకుతో
చైత్రమాస సుందరిలా వచ్చింది తెలుగమ్మాయి
చొరవగ ఓరగ చూసింది
చోళుల నాటి శిల్పంలా
చౌడు బీడుల మనసున మరులు గొలిపే
చందన పరిమళ భావనయే మన తెలుగమ్మాయి.
***********
( చ కు ఋత్వం అక్షరం దొరకని కారణంగా చ్రు ను తీసుకోవడం జరిగింది .
చ్రు- రాజస్థాన్ రాష్ట్రంలో ఒక జిల్లా పేరు, థార్ ఎడారికి స్వాగత ద్వారంలా ఉన్న ఈ జిల్లా అందమైన రేఖా చిత్రాలు చిత్రించడంలో ప్రసిద్ధి చెందినది.)
*******
కుటుంబము
అమ్మ ఆదరణలో ఇంతింతైన
ఈ ఉగ్గుపాల ఊసుల ఋణం
ఎలా? ఏ విధంగా?
ఐకమత్యంతో ఒకింత ఓరిమితో ఔను!
అందరితో అహరహముండుటయే.
********