త్యాగం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

త్యాగం అంటే ఏమిటో

తెలుసుకుని ఆచరించడానికి

మూణ్ణాళ్ళు సరిపోయాయా పువ్వ్వుకు

మరి ఈ మనిషెలా మూడు యుగాలైనా

నేర్వలేనివాడయ్యాడు?

      ********

ఈ మధ్యన ఆకాశం

పదే పదే రంగులెందుకు మారుస్తోందోయ్

ఆ ఏముంది చేయి తిరిగిన

నేతగాళ్ళనెందరినో తనవద్దకు

చేర్చుకుందిగా అందుకు.

      ********

చీమలా కుట్టడం చేతగాక

తన ఇల్లు నీకిచ్చి

తనువు చాలిస్తుందా పట్టుపురుగు.

    ********

Your views are valuable to us!