ఉనికి

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఉనికి
 
తన ఉనికిని చాటుకోవడానికి

కన్నీటిలో పడి కొట్టుకుపోవడం తప్ప
 
వేరే దారేదీ మనసుకి.

*******

తులాబారం
 

అనురాగాల తులాబారంలో

తులసాకు కాలేకపోతోంది

ఆ కన్నీటిబొట్టు.

********

మనసులు

ఎద సడికి రూపమిచ్చా నది

ఆకాశాన్ని ఆహ్వానిస్తే చినుకు శృతిలో

నిన్నటి ఇసుక తిన్నెలపై ఒకటయ్యాయి
 
వారిరువురి మనసులు.

*********

మాను

హృదయపు లోతులను చూడగలిగితే

ఆకాశపుటంచులను చేరవచ్చంటూ

ఆ మాను మర్మగర్భంగా

నీతో ఏదో……..

********

Your views are valuable to us!