Like-o-Meter
[Total: 0 Average: 0]
ఆడుకుంటూనే వాడు
మాట్లాడాడు, పోట్లాడాడు ,
నేర్చాడు నేర్పించాడు.
వాడి ఆచూకీ వాడికి దొరికినందుకు
ఆ బొమ్మల గదిలో ఎన్ని ఆనందబాష్పాలనో రాల్చాడు
కానీ ఇంతలోనే
వేడుకుంటూ వాడు
మాట్లాడడం మరిచాడు
పోట్లాడడం విడిచాడు
తెలియనిదేంతో నేర్చుకుంటూ
ఊహలు ఉచితం కాదని
వాడి చిట్టి మనసుకే నేర్పిస్తూ
వాడికే నచ్చని వాడిపై
ఆ నాలుగు గోడల నడుమే ఎన్ని కన్నీళ్ళనో కార్చాడు.
ఓహో! ఒడి వదిలి వాడు బడికి …..
*******