వేదన

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

 

నిన్న రాత్రి తన చల్లని వెలుగులతో సేద తీర్చిన వెన్నెల
ఈ రోజెందుకు ఇలా కాల్చేస్తోంది ?
నువ్వు వెళ్ళిపోవడం చూసిందా ??

నిన్న మనల్ని నవ్వుతూ పలకరించిన చందమామ
ఈ రోజెందుకు నా వైపు జాలిగా చూస్తున్నాడు ?
నువ్వు లేవని తెలిసిందా ??

నిన్న చాలా అందంగా కనిపించిన ఈ లోకం
ఈ రోజెందుకు ఇలా భయపెడుతుంది ?
నువ్వు ఇక రావని తెలిసిపోయిందా ??

అసలు నిన్న అన్ని అలాగే
ఆనందంగా ఆగిపోతే బాగుండును కదా ?
ఈ రోజెందుకు వచ్చింది ??
నన్నిలా వేధించడానికా ???

Your views are valuable to us!