వెలుతురు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మళ్ళీ
నేను మొలుచుకొస్తాను
నా చావులోనుంచే…

వొంటి గుడిసెలో దీపం పెడతాను
పారిపోయిన పిట్టల్ని పట్టుకొచ్చి
గింజల్ని విసుర్తా

రెక్కలు మొలుచుకొచ్చిన వెలుగుని
చుక్కల చిక్కుల్లోంచి తప్పిస్తా

వక నల్లమల కొండపై
చీకటి గోడ్డళ్ళు వేటు వేస్తే
వెలుతురును విరజిమ్మేసి పోతా..
మీరు మళ్ళీ నన్ను తవ్వి పాతరేసేలోగా

Your views are valuable to us!