వెన్నెల ప్రయాణం

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ప్రవహించే కాలంతో
ప్రకృతి పాట వెతుక్కుంటూ
మౌనంగా సాగిపోయేదాన్ని.

దేవుడు సృష్టించిన
రహస్య కొలనులో
కలువలా నువ్వు వికసించడం తెలిసాక

తామరతూడులాంటి నీ స్పర్శకి
నేనో జలపాతాన్నై
కోటి ఆశల పూలపడవలతో
నీ వైపే ప్రవహిస్తూ …

నీ అలల కదలికల మధ్య
చంద్రబింబాన్నై
నా ఒడిలో నిన్నే చూసుకుంటూ …

నీ రూపాన్ని ఊహించే ప్రయత్నాన
మేఘాల దొంతర్లపై
వేల చిత్రాలు గీసుకుంటూ …

నవమాసాల వెన్నెల ప్రయాణంలో
నేనే ఆ పచ్చటి పాటనై
ప్రకృతినే లాలిస్తున్నా .

Your views are valuable to us!