ఆం.ప్ర విభజన – హైదరాబాద్ భవిష్యత్తు!

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

పార్లమెంటు ఉభయ సభల్లోనూ విభజన బిల్లు పాసైన తర్వాత చాల మంది మనస్సులో ఉన్న ప్రశ్న ఇదే. హైదరాబాదుని కోల్పోయిన సీమాంధ్ర పరిస్థితి ఏంటి ? కొత్తగా వచ్చే సీమాంధ్ర రాజధాని హైదరాబాదుకి  ధీటుగా ఎదగగలదా ? అసలు హైదరాబాదు ఏమవుతుంది ?

Where is it heading?

ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే ప్రస్తుత పరిస్థితిని ఆవేశకావేషాలకి పోకుండా విశ్లేషించాలి. నేటి వరకూ హైదరాబాదు తొమ్మిది కోట్ల తెలుగు ప్రజల తలమానికం. రాష్ట్రానికి చెందిన అన్ని సంస్థలకూ పుట్టిల్లు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలూ కొలువున్న నగరం. విభజనానంతరం Hyderabad నగరం ప్రభుత్వ పరంగా తెలంగాణా రాష్ట్రానికే స్టేటస్ సింబల్. ఎంత పదేళ్ళ వరకూ ఉమ్మడి రాజధాని అని అన్నా, ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ముందుగా సీమాంధ్ర ప్రభుత్వ కార్యాలయాలు కొత్త రాజధానికి మారవలసి వస్తుంది. ముందుగా తప్పని సరిగా హైదరాబాదునుంచి కొత్త రాజధానికి మారవలసిన వారి అంచనా వేద్దాం.

 

  1. ఒక అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు దాదాపు 50 వరకూ ఉంటాయి. నేడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పనిచేస్తూ రేపు కొత్త ప్రభుత్వానికి, దాని రాజధానికి మారవలసిన సీమాంధ్ర ఉద్యోగుల సంఖ్య సుమారు 50,000 వరకూ ఉంటుంది.
  2. దాదాపుగా రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉన్న అన్ని సంస్థల  ఆంద్రప్రదేశ్ కార్యాలయాలూ హైదరాబాదు లోనే ఉన్నాయి. సబ్బులు, పేష్టులూ, ఫాన్లూ, TVలూ, సిగరెట్లూ లాంటి Consumer products, consumer durable companies etc etc.  ఆంద్రప్రదేశ్ బ్రాంచ్ ఆఫీసులు హైదరాబాద్ లో కాక వేరే నగరాల్లో ఉన్న సంస్థలు లేవనే చెప్పొచ్చు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ సంస్థలన్నీ సీమాంధ్రలో కొత్త బ్రాంచ్‍లను తెరవడం తప్పనిసరి అవుతుంది. అది కాక సీమాంధ్రలో అమ్ముడయిన సరుకులన్నిటికీ కొత్త రాష్ట్రంలో commercial taxes కట్టవలసి వస్తుంది. 
  3. అది కాక వేరే కొత్త రైల్వే జోన్ వస్తే South Central Railway నుంచి సగం ఉద్యోగులకీ ఇదే పరిస్థితి వస్తుంది.

ఈ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో స్థాన చలనం అయ్యే ఉద్యోగుల సంఖ్య ఒక లక్ష వరకూ ఉండొచ్చు. అంటే కుటుంబానికి నలుగురి ప్రాతిపదికన నాలుగు లక్షల జనాభా. ప్రతి organized sector ఉద్యోగానికి రెండు unorganized sector ఉద్యోగాలు ఏర్పడతాయన్న అంచనాని మనం నమ్మితే, మరో ఎనిమిది లక్షల జనాభా సీమాంధ్ర కొత్త రాజధానికి తరలుతుంది. ఈ లెక్క ప్రకారం వచ్చే 2-3 ఏళ్లలోనే హైదరాబాదులో మూడు లక్షల ఇళ్ళు ఖాళీ అవుతాయి. అన్ని కొత్త ఇళ్ళు సీమాంధ్రలో కట్టవలసిన అవసరం వస్తుంది. పైన చెప్పినట్టు ఈ లెక్కలు కేవలం తప్పనిసరి పరిస్థితుల్లో స్థాన చలనం అయ్యే వారి లెక్క మాత్రమే. Emotional కారణాల వల్ల హైదరాబాద్ వదిలేద్దామనుకొనే వారి ప్రస్తావన ఇక్కడ లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం అసంభవం. Construction sector మన అందరి ఊహలకన్న చాలా పెద్దది. Steel, cement, tiles, paints, bricks, electrical fittings, bathroom accessories లాంటి ఎన్నో ఉత్పత్తులూ, ఆయా రంగాలకి సంబంధి౦చిన ఉద్యోగాలూ నిర్మాణ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. నిర్మాణ కార్మికుల సంగతి చెప్పనే అక్కరలేదు.

హైదరాబాదులో క్షీణించబోయే construction sector  సీమాంధ్ర జిల్లాల్లో విపరీతంగా పుంజుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వ వాగ్దానాల ప్రకారం ఓడ రేవులు, విమానాశ్రయాలు, highwayలు నిర్మిస్తే ఆర్ధికావకాశాలు మరింత పెరుగుతాయి. ఇదిగాక, అనుకున్నట్టుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రభుత్వం Special economic status ప్రకటిస్తే, ఉత్పత్తి రంగానికి ఈ జిల్లాలు ఎంతో అనువైన ప్రదేశాలుగా మారతాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాలు బెంగుళూరు, చెన్నైలకి ఎంతో దగ్గరగా ఉన్నాయి. వచ్చే సీమాంధ్ర ప్రభుత్వం సరిగా పనిచేస్తే పక్క రాష్ట్రాలకి, తెలంగాణాతో సహా, వచ్చే పెట్టుబడులనీ సీమాంధ్ర ఆకర్షించగలుగుతుంది.

ఏ పెద్ద ప్రోత్సాహకాలూ లేకుండానే చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ఒక్క 2013 లోనే 10,000 కోట్లకి పైగా  పెట్టుబడులని ఆకర్షించిందన్న విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. Tax Holiday లభించే మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ నగరం కూడా ఉంది. సీమాంధ్ర రాజధాని ఎక్కడ వచ్చినా విశాఖ నగరానికి ఉజ్జ్వలమైన  భవిష్యత్తు ఉందనిపిస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరానికి  కొత్త పెట్టుబడులు రావటం కొంత కష్టమే.

చాల మంది వాదన, హైదరాబాద్ లో ఉన్న IT, Software, Pharma, Cinema రంగాలు వేరే చోటకి మారవు కదా అని. ఇది నిజమే.  నా అంచనా ప్రకారం film distribution businessలో కొంత భాగం మాత్రమే మళ్లీ విజయవాడకి తిరిగొస్తుంది. అంతకు మించి ఈ రంగాలేవీ కొత్త రాష్ట్రాన్ని వెంటనే కౌగిలించుకోవు. కానీ ఇక్కడో ముఖ్య విషయాన్ని  ప్రస్తావిస్తాను. ఏ నగరం అభివృద్ధీ నిన్నటి వరకూ ఏం జరిగిందన్న దానిపై ఆధారపడదు. ప్రగతి అన్న పదానికి అర్థం అనుక్షణం ముందుకెళ్ళడం. నేడే౦ జరుగుతోంది, రేపేం జరగబోతోంది అన్నదే ప్రధానం. మూడు లక్షల వరకూ కుటుంబాలు హైదరాబాద్ నుంచి తరలిపోయి, పక్క సీమంధ్ర రాష్ట్రంలో ఆర్ధిక అవకాశాలు పెరిగిన తర్వాత వ్యాపారం దిశ మారుతుంది. నీళ్ళు పల్లమెరిగినట్టు, వ్యాపారం అవకాశాలని వెతుక్కొంటు౦ది. వ్యాపారానికి emotional attachments ఉండవు.

ఆ వ్యాపార అవకాశాలని ఏర్పరచడమే రాబోయే తెలంగాణా ప్రభుత్వ ప్రథమ కర్తవ్య౦. హైదరాబాద్ భవిష్యత్తు దీని మీదే ఆధార పడివుంటుంది. కానీ, 23 జిల్లాల ఒక Giant stateకి రాజధానిగా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్,  పది జిల్లాల రాజధానిగా కుంచించుకు పోయే ఈ తరుణంలో ఎదురు గాలులని ఎదుర్కోబోతోందన్నది మాత్రం నా ప్రగాఢ విశ్వాసం. 

 @@@@@

Your views are valuable to us!