ఈ దేశపు చట్టాలను చేసింది హిందువులేనా?
- హిందూ ఆలయాలు హుండీల నుంచి గానీ భక్తుల విరాళాల రూపంలో గానీ స్వీకరించే ప్రతి రూపాయికీ ఆదాయపు పన్ను చెలిస్తున్నాయి. చర్చిలు, మసీదులు, షిర్డీ సాయిబాబా ఆలయాలు ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించవు – వాటికా అవసరమే లేదు.
- హిందువుల ఆలయాలు మాత్రమే కాదు అవి నడిపే విద్యాసంస్థలు గానీ సేవాసంస్థలు గానీ అదీ ఇదీ అని లేదు ఆలయానికి అనుబంధమైన వాటిలో కూడా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోగలదు. ఇతర మతాలకు సంబంధించి అసలు మతసంస్థల మీదనే అధికారం లేనప్పుడు అనుబంధ సంస్థల మీద అధికారం ప్రభుత్వాని కెట్లా వస్తుంది?
- హిందువులకి తమ మతసంస్థల/దేవాలయల మీద ఎలాంటి యాజమాన్య హక్కులూ లేవు. ఇతర మతాల వారికి తమ తమ ప్రార్ధనా స్థలాల మీదా మతసంస్థల మీదా పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయి.
ప్రశ్న 01: అన్ని మతాల వారి ఆరాధనా స్థలాలను ప్రభుత్వం అజమాయిషీ చెయ్యగలుగుతున్నదా?
జవాబు:
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 02:అన్ని మతాల వారి నుండి కొత్తగా ఆరాధనా స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలదా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 03:అన్ని మతాల వారి ఆరాధనా స్థలాల ఆర్ధిక వ్యవహారాలను ప్రభుత్వం నియంత్రించగలదా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 04:అన్ని మతాల వారి ఆరాధనా స్థలాల వద్ద జరిగే కర్మకాండలను ప్రభుత్వం నియంత్రించగలదా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 05:అన్ని మతాల వారి ఆరాధనా స్థలాల యొక్క ఆస్తుల విక్రయాలను ప్రభుత్వం చెయ్యగలదా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 06:అన్ని మతాల వారి ఆరాధనా స్థలాల నుండి ఆదాయపు పన్నును స్వీకరించగలదా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 07:అన్ని మతాల వారి ఆరాధనా స్థలాల ఆదాయమును ఆ సంస్థ/మతం యొక్క అభ్యున్నతికి గాక ఇతరమైన వాటికి ప్రభుత్వం వినియోగించగలదా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 08:అన్ని మతాల వారికీ వారి ప్రార్ధనా స్థలాల మీద గానీ మతసంస్థల మీద గానీ పూర్తి అధికారాలు ఉన్నాయా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 09:అన్ని మతాల వారి విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించగలదా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
ప్రశ్న 10:అన్ని మతాల వారి విద్యాసంస్థలలో విద్యార్ధుల, ఉపాధ్యాయుల, ఉద్యోగుల నియామకాల్లో మతపరమైన వివక్షను ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయా?
మతం | అవును/లేదు |
హిందూ | అవును |
క్రైస్తవ | లేదు |
మహమ్మదీయ | లేదు |
సిఖ్ | లేదు |
జైన, బౌద్ధ, యూదు | లేదు |
హిందువుల ఆలయాలలో పని చేసే స్వీపర్ల నుంచి పూజారుల వరకు గల అన్ని పనుల వారికీ ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. అంటే, వీళ్ళూ ప్రభుత్వోద్యోగులే, కానీ ప్రభుత్వోద్యోగులకు వర్తించే పే స్కేల్స్ మాత్రం వీరికి వర్తింపజెయ్యరు. ఎందుకంటే హిందువులు నోరు చచ్చిన, చేవచచ్చిన వాళ్ళు కదా! ఏమీ పట్టించుకోరు.
ఒక ఆలయాన్ని తీసుకుంటే, ప్రధాన పూజారి పూజాదికాలలోనూ క్రతువుల విషయంలోనూ స్వంత నిర్ణయాలను తీసుకుని ఇతరుల చేత అమలు చేయించ గలడు కాబట్టి అనుకోకుండానే గెజిటెడ్ ఆఫీసర్ హోదా వస్తుంది. అసలు ఏ సంస్థని అయినా సరే ప్రభుత్వం తన పరిధి లోకి తీసుకుంటే ప్రత్యేకంగా నిర్వచించాల్సిన పని లేకుండానే సెక్రటేరియట్ నుంచి పంచాయితీ గుమస్తా వరకు గల ప్రభుత్వోద్యోగులకు ఏ హక్కులు ఉంటాయో అవి ఇచ్చి తీరాలి.
ఒక ప్రభుత్వ సంస్థలో గానీ దాని శాఖలో గానీ అనుబంధ సంస్థలో గానీ మనుషుల సంఖ్యను బట్టి జీతాలు మారవు.అంటే, ఉద్యోగులు 10,000 మంది ఉన్నా 10 మంది ఉన్నా ప్రభుత్వం నిర్ణయించిన ర్యాంకుల్లో LDC, UDC, Gazetted Officer స్థాయి ఉద్యోగులకి జీతాలు ఒకే రకంగా ఇవ్వాలి. ఈ లెక్క ప్రకారం జీతాల నిర్ణయం జరిగిందా? హిందువుల్లో మతం పట్ల అభిమానం ఉన్న లాయర్లు కల్పించుకుని బలమైన కేసులు వేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
ప్రభుత్వోద్యోగి అయిన ప్రతి ఒక్కడికీ ఒకటో తారీఖు కల్లా జీతం జమ కావాలి. ఒకవేళ తక్షణం ఇవ్వలేకపోయినా ఎన్ని నెలలు అతను ప్రభుత్వం దఖలు పరుచుకున్న ఆలయంలో పూజారిగా చేశాడో అన్ని నెలలకీ కలిపి చచ్చినట్టు ఇచ్చి తీరాలి – దానికోసం ధర్నాలు చెయ్యనక్కర లేదు. చట్టంలో ఏమి ఉందో చూసి ముఖ్యమంత్రిని ముద్దాయిని చేసి కోర్టులో కేసు వెయ్యొచ్చు కదా!
హిందువుల్లొ ఇలాంటి లాపాయింట్లు పట్టగలిగిన లాయర్లే లేరా? appointment, termination, leave and working hours, pay and terminal benefits నిర్వచించబడినప్పుడు ఠంచనుగా జీత ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యాతా ముక్కు పిండి వసూలు చేసుకోవడం పూజారుల యొక్క హక్కూ అవుతుంది కదా!
పే స్కేల్స్ అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాన్ని క్రమబద్ధీకరించటం కూడా ప్రభుత్వం యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ కదా! హక్కులు ఉన్నప్పటికీ ఉపయోగించుకునే తెలివి లేక హిందువులు అన్యాయానికి గురవుతున్నారని నాకనిపిస్తున్నది, మీరేమంటారు?
అందరూ సకాలంలో స్పందించి శ్రీశైలం ఆలయం విషయంలో నేరస్తుణ్ణి బదిలీ చేయించడం కొంతవరకే విజయం సాధించినట్టు లెక్క. బదిలీ అంటే మరో చోట దుకాణం పెట్టడానికి అవకాశం ఇవ్వడమే కదా! ఆలయాలు ప్రభుత్వం అజమాయిషీలో ఉన్నంతకాలం ఈ పునరపి సమస్యలు తప్పవు.అసలు ఈ చట్టంలోనే లోపాలు ఉన్నప్పుడు మాటిమాటికీ గొడవలు చెయ్యటం కన్న ఆలయాలని ప్రభుత్వం యొక్క పట్టు నుంచి తప్పించి అదివరకటి ధర్మకర్తల వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం మంచిది.
@@@@@
ఆలయాల ప్రభుత్వ నిర్వహణలో ఉంటే తప్పసరిగా జరిగే లోపాలు ఇవి:
- ఇతర మతాల వారు వారి వారి మతసంస్థలను లౌకిక చట్టాలకు లోబడి నడుపుకుంటున్నప్పుడు హిందువులు తమ మతసంస్థలను లౌకిక చట్టాలకు లోబడి ఎందుకు నడుపుకోలేరు? ఇది ప్రస్తుతం హిందువులలో ఆత్మన్యూనతని కలిగిస్తున్నది. ఎందుకంటే, ఆలయాలను తీసుకోవటానికి ప్రయత్నించినప్పుడు కొందరు హిందువులు వ్యతిరేకించారు గానీ కమ్యూనిష్టులు అస్పృశ్యత దగ్గిరుంచి దేవదాసీల వరకు అనేక విషయాలను ప్రస్తావించి హిందువుల నోరు నొక్కేశారు. మనం మళ్ళీ ఇప్పుడు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అవే వాదనల్ని బయటికి తియ్యవచ్చును. ముందునుంచే అన్నీ ఆలోచించుకుని సిద్ధంగా వుండాలి. బైబిలులో లోతు కూతుళ్ళు తండ్రితో సంగమించినట్టు ఉంది, ఖురానులో ప్రవక్త పినతల్లిని వివాహం చేసుకున్నట్టు ఉంది. కానీ కళల్ని దేవతార్చన అనుకునే మన సంప్రదాయంలో వాళ్ళు అసభ్యతని చూసి అల్లరి చేస్తే సిగ్గు పడి వెనక్కి తగ్గారు అప్పటి హిందువులు.
- ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు తమ పరిపాలనలో ఫెయిలయ్యి ఖజానా దివాళా తీసినప్పుడల్లా అలయల ఆస్తుల్ని వేలం వెయ్యడం, ఆలయాల ఆస్తుల్ని బహిరంగ మార్కెట్లలో విక్రయించడం అలవాటైపోయింది.చట్టంలోనే ఆ వెసులుబాటు ఉన్నప్పుడు ఆపడానికి దారేది?కుయ్యిమంటే కయ్యిమంటే ధర్నా చెయ్యడానికి ఓపిక వుండొద్దూ.
- ఆలయాల సొమ్ము కదా, తీసుకున్న సొమ్ములో కొంతైనా వెనక్కి ఇద్దామనే బుద్ధి ఎవరికీ ఉండటంలేదు – అక్కడ ప్రభుత్వంలో ఉంటున్నది కూడా హిందువులే మళ్ళీ!ఒక ఆలయం ఉన్నదీ అంటే అనుబంధంగా ఒక వేద పాఠశాల పెట్టుకుని తనకు కావలసిన అర్చకుల్నీ యాజ్ఞికుల్నీ అక్కడనుంచి తీసుకుంటే ఆలయం మరింత శక్తివంతం అవుతుంది. ప్రభుత్వం యొక్క పెత్తనం వల్లనే అది జరగటం లేదు.
- ఆదాయం ఎంత పెరిగినా మౌలిక సౌకర్యాలకే తడుముకోవలసి వస్తున్నది. 2010-11 సంవత్సరానికి 18.56 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసిన శ్రీరంగం ఆలయమే వాళ్ళెటూ జీతాలు ఇవ్వరని భక్తుల కానుకల నుంచీ అష్టోత్తరం పూజల టిక్కెట్ల నుంచి వచ్చిన ఆదాయంతో జీతాలు ఇవ్వాల్సి వచ్చింది.
- ఆలయాల ఆస్తులు అనుకోకుండానే ప్రబుత్వ ఆస్తులు అయిపోవడం అమ్మేసినా వేలం వేసినా కబ్జాలు చేసినా అదేమని అడగటానికి వీల్లేని పరిస్థితిని కల్పించింది. ఒక్క తమిళనాడులోనే 1986 నుంచీ 2005 మధ్యలో 47,000 కోట్ల ఎకరాల భూమి ఆలయాల అధీనం నుంచి చెయ్యి జారిపోయింది. తాజాగా 10 మిలియన్ చదరపు అడుగుల భూమిని ఆక్రమించడానికి పధకాలు ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలుస్తున్నది.
- అన్నిటికంటె అతి ముఖ్యమైన ప్రమాదం విగ్రహాల చోరీ. దాదాపు నేరం నిరూపణ అయిన ప్రతై కేసులోనూ ప్రబుత్వం నియమించిన ఎండోమెంట్ శాఖ అధికారుల ప్రమేయం ఉంటున్నది. హిందూ మతస్థులు కానివాళ్ళకీ పనిగట్టుకుని విగ్రహారాధనని ద్వేషించే మతాల వారికీ ఆలయాల పట్ల గానీ అర్చామూర్తుల పట్ల గానీ చిన్నచూపు ఉండి తీరుతుంది.దాంతో వాళ్ళకి అమ్మితే వచ్చే డబ్బు మీద ఆశ ఎక్కువ ఉంటుంది గానీ విగ్రహాల పట్ల అభిమానం ఉండదు.ఇతర మతస్థుల్ని అలాంటి కీలకమైన పదవులలో ఉంచేదే అందుకని నా అనుమానం.
- అసలు ప్రభుత్వం అనేది ఆలయాల నిర్వహణలో కలగజేసుకోవడమే ప్రభుత్వంలోని అవినీతిని ఆలయాల లోనికి కూడా వ్యాపింపజేసి వీటిని భ్రష్టు పట్టించటానికి అయినప్పుడు ఆలయాలని ప్రభుత్వ అధీనంలో ఉంచి నివేదికలతోనూ ధర్నాలతోనూ అవినీతినీ ఆసంగత నిర్ణయాలనీ ఆపడం అసాధ్యం!
P.S: చంద్రబాబుతో తెగదెంపులు చేసుకున్న భాజపా అభిమానులు అతని మీద ద్వేషంతో జగన్‍కు తమ వోట్లని బదలాయించి 150+ సీట్లని తెచ్చిపెట్టి ఇవ్వాళ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి వోట్లు దండుకోవాలని చూస్తున్నారు. వీలైతే ఆలయ విమోచన ఉద్యమం ప్రజల నుంచి మంచి స్పందన తెచ్చుకోగలిగితే ఒక కొత్త రాజకీయ పార్టీని మనమే పెట్టాలి.
చట్టసభల దగ్గర జరిగిన అన్యాయాన్ని చట్టసభలకు వెళ్ళకుండా సరిదిద్దడం కుదిరే పని కాదు. చట్టసభలకు వెళ్ళాలంటే ఉద్యమం ఏదో ఒక రోజున రాజకీయ పార్టీ రూపం తీసుకోక తప్పదు.కేవలం ఆలయాలని విముక్తం చెయ్యటం కోసమే పార్టీ పెట్టి అది జరగ్గానే రద్దు చెయ్యడం కూడా తెలివితక్కువ పనే.ఆలయాలను విముక్తం చేశాక ఇవ్వాళ్టి Rothschilds Banking System నుంచి కూడా విముక్తం కాకపోతే అసలు ఆలయాలని స్వతంత్రం చెయ్యడమే వృధా అయిపోతుంది. స్వతంత్ర ఆలయాల నికరమైన నిధులతో Transparent Banking System ఏర్పాటు చెయ్యాలి. ఆ కొత్త వ్యవస్థను సమర్ధవంతమైన రీతిలో నడపటం ఒక దీర్ఘకాలికమైన వ్యవహారం. నిజానికి ఇది కొత్త వ్యవస్థ కాదు. ఆలయాలు ధర్మకర్తల కింద ఉన్నప్పటి పాత కాలంలో ఆలయాలు అత్యవసరమైన పనుల కోసం ప్రజలకీ, రాజులకీ అప్పులు ఇచ్చేవి. బౌద్ధారామాలు కూడా అందుకు మినహాయింపు కాదు. మన సొంత బ్యాంకుల్ని ఉపయోగించుకుంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గిర అప్పు చెయ్యాల్సిన అవసరం ఏమిటి?
వీలయినంత త్వరలో ఆలయాలకి పూర్తి స్వయం ప్రతిపత్తిని తెచ్చుకుని వాటిని బ్యాంకుల కింద మార్చి మన స్వయం సమృద్ధత కోసం మనమే ప్లానులు వేసుకోకపోతే సర్వనాశనం అయిపోవడం ఖాయం!
హిందూ ఆలయ విమోచన ఉద్యమం వేగవంతం కావాలి!