గాంధి జయంతి ప్రకటనలు – పితృ లోకం లో చర్చ

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఒక పితృ దేవత (ఓ పి దే) – గాంధి చనిపోయాక ఆ వార్త తట్టుకోలేక మరణించిన ఒక గుజరాతీ భారతీయుడు):  నిరాడంబరతకు చిహ్నమైన గాంధిని మహాత్మా అని పిలవడం వెనుక ఆయన జీవన శైలి కారణం. అట్టి గాంధి జయంతి రోజున భారత ప్రజల ధనాన్ని ఆయన ఫోటోలు ముద్రించడానికి ఆయన పేరుతొ ఇతర రాజకీయ ప్రాధాన్యతతో కూడిన విషయాలను ప్రతిపాదించడానికి భారత ప్రభుత్వం , ఇతర రాష్ట్ర  ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు చూస్తుంటే నాకు చాల బాధగా ఉంది.
 
మరొక పితృ దేవత (మ పి దే):  నిజమే గాంధీ గారు ఈ పితృలోకం లో నుంచి విడుదలై వెళ్ళే ముందు నాతో అన్నారు “కలి ప్రభావం వల్ల నా పేరు చెప్పోకొని నా ఫోటో ముద్రించి, నేను నమ్మే, ఆచరించే విలువలను ఉటంకిస్తూ ఎన్నో అన్యాయాలు జరుగు తాయి వీటికి తగిన పరిహారం అలా చేసిన వారికి, వారి, వారి, వారికి  ఆ యమ సదనంలో దొరకక మానదు” అని.
 
ఓ పి దే: అది సరే మొన్న కొత్తగా ఇక్కడకు వచ్చిన ఒకాయన చెప్పాడు గాంధి పేరున ఎన్నో రహదారులు ఉన్నాయట భారత దేశం లో!
 
మ పి దే: ఉన్నాయి కాని అవన్నీ నయ వంచనకు, కుట్రలకు, కుతంత్రాలకు, అమానుష వ్యాపారాలకు సాక్షులై ఉన్నాయి. నువ్వు చెప్పిన విషయం నిజమే గాంధీ గారి జయంతి రోజున ప్రభుత్వం ప్రకటన ల కోసం పెట్టె ఖర్చు కనీసం ఒక వంద కుటుంబాలకు ఏ లోటూ రాకుండా చేయగలదు. కాని గాంధీ గారన్న మాటే నిజం కలి కాలం లో మానవ మేధస్సు వెర్రి పుంతలు తొక్కి ఎక్కువగా అనవసరపు విషయాలపై విలువైన ధనాన్ని వెచ్చిస్తారు.
 
అక్కడే ఎప్పటినుంచో విడుదలకు నోచుకోని ఒక పితృ దేవత కలుగ చేసుకొని:  నేను గత కొన్ని వందల సం. లు గా చూస్తున్నాను భారత దేశం లో కలి ప్రభావం గత ముప్పై రోజుల (ఒక రోజు ఒక సం. రం. కనుక ౩౦ ఏళ్ల) నుంచి చాల ఎక్కువ ఔతూ ఉంది. నేను తిని ౩౦ రోజులు అయింది. కనీసం అలా ప్రకటనలు విడుదల చేయడానికి ఖర్చు చేసే ఆ ధనాన్ని నా లాటి వారికి పిండోదికాలు ఇవ్వడానికి వినియోగిస్తే బాగుండును.
 
ఓ పి దే :  అయ్యా మీ రన్నది నిజం. మనం తక్షణమే ఒక వృద్ధ రాజకీయ నాయకుణ్ణి ప్రభావితం చేసి ఈ కార్యక్రమానికి శుభారంభం చేద్దాం.
 
మ. పి. దే :  మీరు ఇలా చేయడం ద్వారా అవైదికతను కలి ప్రభావాన్ని ఇక్కడకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది!
 
ఓ పి దే: అలాగా అది ఎలా?
 
మ. పి. దే: ఎలా అంటే గాంధీ గారి జయంతి రోజు న అనవసరం గా ప్రజా ధనాన్ని ఖర్చు చేసే వాళ్ళు ఎలా ఆయన కు (గాంధి గారికి ) ద్రోహం చేసిన వాళ్ళు అవుతారో మనమూ ఆ శ్రీ హరి నియమించిన విధానానికి ద్రోహం చేసిన వాళ్లము ఔతాము.  వద్దు అలా చేయవద్దు. కాదు చేయడం సబబే అని ఓ.పి. దే వెంటనే భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మనస్సులో ఒక ప్రచోదనం కలిగించాడు.
 
మరుసటి రోజు భూలోకంలో భారత దేశం లో ప్రధాన పత్రికలన్నీ ఒక భారి ప్రకటనను విడుదల చేసాయి: 
 
రాజీవ్ పితృ కార్య కమీషన్ – ఒక గొప్ప లౌకిక కార్యం అలౌకిక సిద్ధి కొరకు.
 
భారతదేశం లో మరణించిన ప్రతి జీవికి పితృ కార్యం నిర్విఘ్నం గా జరగాలని కుల, మత, ప్రాంత, దేశ భావాలకు అతీతం గా చేపట్టిన ఒక అద్భుత కార్యక్రమం. భారతదేశం లో చనిపోయిన వారి వివరాలు తప్పక రిజిస్టర్ చేయండి. చనిపోయిన తేదీ, లేదా  తిధి, వార నక్షత్రాలతో వ్యక్తీ పేరు గోత్రం ఉంటె గోత్రం ఆ వ్యక్తీ తాలూకు నాలుగు తరాల వారి పేర్లు (ఉంటేనే) తెలుపుతూ స్థానిక ప్రభుత్వ అధికారికి  ఈ వెబ్ సైట్ ద్వారా వివరాలు పంపండి దీనితో పాటు ఎవరికీ తోచిన మొత్తాన్ని వారు దానం చేయవచ్చు ఐచ్చికం గా. దానం చేసిన సొమ్ము కు  ఆదాయపు పన్ను మినహాయింపు వంద శాతం ఉంది.
 
మరుసటి రోజు, మరొక ప్రకటన రాజీవ్ పితృ కార్య కమీషన్ ద్వారా మొదటి రోజునే వెయ్యి నాలు వందల కోట్ల రూపాయలు కమీషన్ బ్యాంకు లో జమ అయ్యాయి అని.
 
@@@@@ 

Your views are valuable to us!