Like-o-Meter
[Total: 1 Average: 4]
“పల్నాటి వీరభారతం”
ఇది తెలుగువారి భారతం. మహాకవి శ్రీనాథుణ్ణి సైతం ద్విపద కావ్యాన్ని వ్రాయడానికి పురిగొల్పిన వీరరసభరితం. కరుణ, శాంత రసాల సమ్మిళితం. పగలతో రగిలిన గుండెలు తుదకు ఆధ్యాత్మిక దివ్యజలధారాలలో చల్లారిన వైనాన్ని ఆవిష్కరించే వాస్తవపూరితం…ఈ పల్నాటి వీరభారతం.
రచయిత చిట్టిబాబు గారు ఆనాటి క్షణాలలో బ్రతికి, ప్రతి పాత్రలోనూ ప్రవేశించి, వారి వారి మనోభావాలను విస్పష్టంగాను, సునిశితంగా, సూక్ష్మంగానూ తీర్చిదిద్దిన రూపొందించిన కథన కదనం ఆద్యంతం ఉత్కంఠభరితం.
పందొమ్మిది వందల డెబ్బైవ దశకంలో ముద్రితమయిన ఈ పుస్తకాన్ని ఆవకాయ పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
చదవండి…ఆస్వాదించండి…అనుభవైకవేద్యంగా తెలుగు భారతంలో పాలుపంచుకోండి!
# # # # #