శైలజా మిత్ర గారి “అడ్డా” కథల సంపుటిని ఈపుస్తకంగా మీకు అందిస్తున్నాం. ఇందుకు సహకరించిన రచయిత్రిగారికి మా ధన్యవాదాలు.
“అడ్డా” కథల సంపుటికి వేదగిరి రాంబాబు గారి ముందుమాట లోని కొన్ని ముఖ్యాంశాలు
“మానవ సంబంధాల మీద రచయిత్రికి గట్టి నమ్మకం ఉందని, నిర్మలమైన ప్రేమతో అవి నిలబడతాయని రచయిత్రి గాఢంగా నమ్ముతున్నారని ఈ కథానికలు చెబుతున్నాయి….
ఈ కథానికలన్నీ పాజిటివ్ దృక్పథంతోనే కనిపిస్తాయి. నాణెమనే జీవితంలో బొమ్మ, బొరుసు తప్పవనే తెలియజేస్తారు శైలజామిత్రాగారు…
రాబోయే రోజుల్ని తలచుకుని భయపడే గాజుగుండెల్ని పరిచయం చేస్తారు…ఇప్పటికీ అలనాటి సీతమ్మ జీవితాన్ని పోలిన గాథల్ని చెప్తారు…
ఆలోచించే గుణాన్ని పెంచేవే మంచి కథానికలని నా అభిప్రాయం. అలాగే మనం ఆలోచించాల్సిన కోణంలో మాత్రమే ఆలోచింపజేసే శిల్పం ముఖ్యం. ఈ విషయాలు ఆకళింపు చేసుకున్న రచయిత్రి శైలజామిత్ర భాష కూడా గలగలా ప్రవహిస్తుంది. ఎక్కడా అడ్డం పడదు.”
చదవండి....శైలజామిత్రా గారి "అడ్డా" కథల సంపుటి.