ప్రముఖ కవి ఇస్మాయిల్ గారు హైకూ గురించి చెబుతూ “చంద్రుణ్ణి చూపించే వేలు“గా అభివర్ణించారు.
ఇంతటి అపురూపమైన నిర్వచనాన్ని తెలుగు సాహిత్యప్రియులకు అందించిన బివివి ప్రసాద్ గారు ధన్యులు.
వీరు వ్రాసి, ప్రచురించిన ’బి.వి.వి.ప్రసాద్ హైకూలు” అనే సంకలనంలో హైకూపై తన మాటల్ని వ్రాస్తూ ఇస్మాయిల్ గారు హైకూను ఇలా నిర్వచించారు.
బి.వి.వి. ప్రసాద్ గారి రచనల్లో జీవితం పట్ల వారికున్న ఆలోచనలు తెలిసివస్తాయి. కేవలం చప్పట్లనే ఆశించే జీవితం కంటే కాసిన్ని నిట్టూర్పులు, విరహాలు, వైరాగ్యమూ ప్రసాదించే జీవితాన్ని ప్రసాద్ గారు కోరుతున్నట్టుగా అగుపిస్తుంది.
ఇదొక సౌందర్యపిపాస లాలసం. అన్ని రుచులకూ తమదైన అస్తిత్వమున్నట్టే జీవితంలోని ప్రతి అనుభవమూ తనదైన ముద్రను వేసి వెళ్తుంది. ఆ అనుభవనాకి జడిసి, దూరం జరిగేకన్నా యథాతథంగా ఆహ్వానించి, అనుభవించాలన్న తపన ఆయలో కనబడుతుంది. ఆ లక్షణాలే ప్రసాద్ గారి హైకూల్లోనూ ప్రదర్శితాలౌతాయి.
[amazon_link asins=’0140424768,1446150410,9352762789,0486292746′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’4d191a96-af3f-4a89-a524-e2f9bdf5864d’]ఎంత అందంగా నవ్విందీ
పాపాయికి చెప్పాలి
పెద్దయ్యాక
ప్రతి ముఖం నుండీ
అవిరామంగా
జీవన సంగీతం
తెప్పరిల్లాక
దిగులు
నైరూప్య చిత్రం
వ్యక్తిత్వం
ఒక వెలుగు
ఒక నీడ కూడా
నిలువుటద్దాల్లాంటి హైకూలు నిండిన ఈ పుస్తకాన్ని చదువుతుంటే మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది.
ఇస్మాయిల్, డా. సంజీవ్‍దేవ్, శ్రీమతి ఓల్గా ముందుమాటలు, ఆప్తవాక్యాలతో బాటు హైకూలపై బి.వి.వి. ప్రసాద్ గారి అభిప్రాయాలు, ఓ రేడియో ఇంటర్వ్యూ అదనపు ఆకర్షణలే గాక అతి ముఖ్యమైన సమాచారాల్ని పఠితలకు అందిస్తాయి.
చదవండి…బి.వి.వి. ప్రసాద్ గారి హైకూలు!
ధన్యవాదాలతో
ఆవకాయ.కామ్ సంపాదక బృందం