నిడదవోలు మాలతి గారి పేరు గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యప్రియులకు పరిచితమైనదే. ఆంగ్ల భాష, సాహిత్యాలలో పట్టభద్రులైన మాలతి గారు ఆణిముత్యాల్లాంటి తెలుగు రచనలను పాఠకులకు అందించారు. అంతేగాక, ఆంగ్లంలో అనువాదాల ద్వారా తెలుగు రుచులను గుబాళింపజేసారు.
కాలంతో బాటే కలిసినడవడం విజ్ణుల లక్షణం. అలానే, మాలతిగారు అంతర్జాల మాధ్యమం ద్వారా పాఠకుల్ని అలరించారు. ఆన్ లైన్ మీడియాలో తెలుగువారు బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలోనే www.thulika.net ద్వారా సాహిత్య వ్యవసాయ విస్తృతిని పెంచిన ప్రముఖుల్లో మాలతిగారు ప్రథమ పంక్తిలో వస్తారు.
సాహిత్య సేవలో తనవంతు ఉడుతాభక్తిగా పాల్గొంటున్న బుడుత ఆవకాయ.కామ్. మా కృషికి పెద్దల ఆశీఃపూర్వక తోడ్పాటు ఎంతగానో లభిస్తోంది. మేమందిస్తున్న “కథా మాలతి” ఒక నిదర్శనం. ఇందుకుగానూ, మాలతిగారి మా హృత్త్పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
గుబురుగా అల్లుకున్న కథల మాలతి క్రింద మన రోజూవారీ ఇరుకు జీవితాలను సేద తీరనిద్దాం.
మరి ఆలస్యమెందుకు?
అభినందనలతో
రఘోత్తమరావు & సాయికిరణ్ కుమార్
ఆవకాయ.కామ్
{jcomments on}