అపాన కళాకారులు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 


Original Author: Ravinar, MediaCrooks.com            Telugu Translation: C. Raghothama Rao

Read original article on MediaCrooks.com

Link >> Fiberal Artyfarts


 

“వేసవికాలం వేడి నుండి తప్పించుకోవడానికని డ్రైవర్లు ఇంజన్ ఫర్నెస్‍ లోకి దూకేసారు.”

వుడ్‍హౌస్ తరహాలో వుండే పై చెప్పిన హాస్యోక్తులు మన కమ్యూనిస్ట్ ఫిబరెల్స్‍కు చక్కగా సరిపోతాయి. ఎల్టన్ జాన్ తరహాలో చెప్పాల్ంటే వీరు “కాలిపోతున్న ఇంటిని చూరు”ను పట్టుకు వేళ్ళాడే నిరాశాపరులు. భారతదేశం నుండి అమెరికా వరకు, ఈ కామ్మీ ఫిబెరల్స్‍ వారి నిరాశను వెర్రిబాగులతనాన్ని కప్పిపుచ్చే సాధనం ఏదైనా సరే వదలక పట్టుకుని వేళ్ళాడుతున్నారు. ఇదిగో ఈ “కొంటె చేష్టల మహారాణి”ని చూడండి, పిచ్చి ప్రేలాపనల్ని ఎలా పతాక శీర్షికలుగా ప్రకటిస్తోందో…

ఐనా ఇవేవీ పనిచేస్తున్నట్టు కనిపించడంలేదు. వార్తలు, సమీక్షలు, సమాచార స్రవంతులు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోవుండి ఈ “ఆర్ట్సీ-ఫార్టీ”ల ఆటల్ని కట్టిస్తున్నాయి. అనవసరంగా నోరు పారేసుకునే బాలీవుడ్ బుద్ధిహీనులైన అనురాగ్ కాశ్యప్, రామ్ గోపాల్ వర్మలు మొదలు సోషియలైట్ జీవిత బురదరొంపిలో పొర్లాడే శోభాడే వరకు గల ఏ జడమతుల్ని ప్రజలు ఊరకే వదిలి పెట్టడం లేదు. వీరే కాదు, సోషియల్ నెట్‍వర్క్స్ లో మితంగా మాట్లాడే పోలీస్ ట్విటర్ హ్యాండిల్స్ కూడా ఒక్కోసారి వీరి వాగుడుదనానికి అడ్డుకట్ట వేయకుండా ఉండడం లేదు.

ఈ మధ్యకాలంలో ’కళాహృదయం’గల మేధావులమని అనుకునే శోభాడే వంటి కామ్మీ ఫిబెరల్స్ కు ఇంటర్నెట్ ప్రపంచంలో నిలువ నీడ లేకుండా పోతోంది. ఆ ప్రపంచంలో వారి “కాటు”కు తిరుగు “దెబ్బ” కొట్టేవారు ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. కొద్దికాలం క్రితం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన కన్హయాలాల్ అనే పాత్రను కనిపెట్టిన కామ్మీయులు అమోఘమైన భావతృప్తిని కలసికట్టుగా పొందారు. ఓ తెంపరి ’మేధావి’ ఆ కన్హయాలాల్ లో ’మోడికి దీటైన మగాడి’ని కనిపెట్టేసినట్టుగా బొబ్బరించాడు. వాహ్! ఈ ’కనిపెట్టుడు’ దెబ్బతో మోడికి ఒళ్ళు చల్లబడి, కాళ్ళు వణికిపోయివుండాలి!

బర్ఖాదత్, రాజ్‍దీప్ సర్దేశాయ్, రాహుల్ కన్వల్ వంటి ఎందరో ఇంగ్లీషు మీడియా ముఠా నాయకులు కన్హయాలాల్ కాళ్ళకు దండాలు పెట్టడానికి వరుస కట్టారు. కానీ “విధి బలీయము”, “తానొకటి తలిస్తే దైవ మొకటి తలచును” అన్న చందంగా కన్హయాలాల్ అదేపనిగా ఓండ్ర పెట్టడం మొదలెట్టాడు. దాంతో, ఈ కామ్మీయులు కట్టబెట్టిన ’జాతి గుర్రం’ ముసుగు జారి అవతలకు పడింది. ఇప్పుడు ఫిబరల్ కామ్మీ సంతతికి మరో ’జాతి గుర్రా’న్ని తయారు చేసుకోవల్సిన అవసరం అత్యవసరంగా వచ్చి పడింది. “అదే మన తక్షణ కర్తవ్యము” అంటూ వెదకసాగిన వీరి కాలికి అనతికాలంలోనే ఓ తీగ అల్లుకుపోయింది. ఇహ ఆ తీగను రాక్‍స్టార్ గా మార్చడమే మిగిలింది.

పనికిమాలిన జె.ఎన్.యూ రాద్ధాంత సీమల్లో, ’గుర్‍మెహర్ కౌర్’ అనే ఓ కొత్త పాత్ర వెలికివచ్చింది. మన కామ్మీయుల కంట పడింది. ఈ అమ్మాయి కార్గిల్ యుద్ధంలో అమరుడయిన ఓ వీరసైనికుని కుమార్తె. ఢిల్లీ విశ్వవిద్యాలంలో చదువుకుంటోంది.

కార్గిల్ అమర వీరుడు – కామ్మీలకు దొరికిన మహాద్భుత రక్షణా కవచం. “అహో! ఏమి వీరి సౌభాగ్యము!”

కార్గిల్ యుద్ధంలో ప్రాణాలను అర్పించిన అమర వీరుని కుమార్తె ఇప్పుడు “భారత్ కే టుకుడే” ప్లస్ “అఫ్జల్ ప్రేమికుల’ ముఠాలో చేరింది. భలే భలే!

ఇవేవీ చాలవన్నట్టు, ఈ అమ్మాయి AAP సభ్యురాలు కూడా. కవితాకృష్ణన్, షబ్నమ్ హష్మి, జాన్ దయాళ్ వంటి వారితో రాసుకు పూసుకు తిరుగుతోంది. వీరందరూ ఈ అమ్మాయిని మరింత మూర్ఖంగా వ్యవహరించడానికై చక్కటి తర్ఫీదును ఇస్తున్నారు.  ’రామజాస్’ కాలేజ్ లో జరిగిన గొడవ తర్వాత ఈ అమ్మాయి…ఇదిగో…ఇలా ఓ రాతప్రతిని చేత్తో పట్టుకుని దర్శనమిచ్చింది. ABVP గూండాలకు తాను వ్యతిరేకినని, ఈ విషయంలో తాను ఒంటరిగా లేనని, భారతదేశంలోని ప్రతి విద్యార్థి తనతో ఉన్నట్టుగా చెప్పుకొంది. బహు బాగు!

ఇంతకూ రామజాస్ కళాశాల కథను క్లుప్తంగా చెప్పుకుంటే – దేశవ్యతిరేకులయిన ఖలేద్ ఉమర్, షెహ్లా రషీద్ వంటి వారు ఢిల్లీ యూనివర్సిటీకి కూడా పాకారు. ఆ విద్యాలయాన్ని కూడా విషపూరితం చేయడానికి నడుం కట్టారు. వీరి చర్యలను ABVP వ్యతిరేకిస్తున్న దశలో జగడాలు జరిగాయి.

[amazon_link asins=’B015HGRZ3Q,935136593X,9350293439,9352776070′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’94f60a9e-0eb6-11e9-950b-05bd8128782e’]

 షెహ్లా రషీద్ తనపై దాడి జరిగినట్టుగా చెప్పింది. పెద్ద పెద్ద రాళ్ళను కొడితే గాయపడినట్టుగా ప్రకటించింది. ఆమె వెంటనే ట్విటర్ లో తనపై జరిగిన ’దాడి’ గురించి తెలియజేసింది. ’గాయపడిన’ ఆమె వెనువెంటనే కామ్మీయుల అభిమాన ఆసుపత్రి అయిన NDTV లో అడ్మిట్ అయింది. అక్కడ తన బాధను వెళ్ళబోసుకొంది. కళాత్మకత! అద్భుత ’కలా’త్మకత!

అప్పుడు వచ్చింది…గుర్‍మెహర్ ప్లకార్డ్ ప్రదర్శన. హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఈ ప్రదర్శనను ’గొప్ప సాహసచర్య’గా అభివర్ణించింది. అంతే! బర్ఖా, సీతారాం యేచూరి తతిమ్మా కామ్మీయులు ప్రేలాపనల పరంపరను మొదలెట్టారు.

సరే! ఇప్పుడు, ఈ గుర్‍మెహర్ కూడా అమరవీరుడయిన తన తండ్రిలానే ఓ గొప్ప కథానాయకురాలు. అర్థమయింది. మాకు బాగా అర్థమయింది. ’ధైర్యవంతురా’లై, నోబెల్ బహుమతిని సాధించిన ’మలాలా’ లానే ఈ గుర్‍మెహర్‍కు కూడా ఓ నోబెల్ ప్రైజును ఇప్పిస్తారేమో చూడాలి. అసలు విషయాన్ని మీరందరూ మర్చిపోయే లోపు ABVP ’గుండాలు’ సాగించిన దమనకాండ ఏమిటో? శాంతికాముకులైన SFI, ’అఫ్జల్ గురు ప్రేమికుల’పై వారు జరిపిన దాడులేమిటో చెప్పేస్తాను. అది కూడా నా మాటల్లో కాదు, నాకంటే గొప్పగా చెప్పగలిగే కామ్మీయుల ఆసుపత్రి NDTV మాటల్తోనే చెబుతాను.

సో, ప్రశాంత్ ముఖర్జీ అనబడే ఈ SFI శాంతికామునికి ప్రకారం ఏబివీపీయులు వీరిని చితకబొడుస్తున్నప్పుడు అక్కడున్న పోలీసులు మౌనప్రేక్షకుల్లా మిగిలిపోయారన్నమాట. నిజం చెప్పాలంటే, ఇతణ్ణి చూడగానే బాలీవుడ్ లో బ్రతుకుతున్న ఓ బెంగాలి కామ్మీ దర్శకమన్యుడు చప్పున గుర్తుకొచ్చాడు. ఆ ’కలా’దర్శకుడికి, ఈ కుర్రోడికి పోలికలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో కామ్మీ పెంపక కేంద్రమైన ’The Hindu’ పత్రిక ఇతనికి వత్తాసుగా నిలిచింది. ఈ ’ముక్రీ’ని ABVP గూండాలు కుళ్ళపొడిచినట్టుగా కథను కట్టింది. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయారని తూర్పారాబట్టింది. కానీ అసలు విషయం ఏమిటంటే…

 

ఇక్కడ ఒక్కటే సమస్య ఉంది. వామపక్షీయులు వెలిగక్కే వెర్రిబాగుల అబద్ధాలు నిలబడ్డంలేదు. ప్రశాంత్ ముఖర్జీని బాధితునిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది The Hindu. అంతే కాదు, తనపై దాడి జరిగిందని NDTV స్టుడియోలో ఈ ముఖర్జీ అబద్ధపు కన్నీళ్ళను కార్చాడు. కానీ అతనే పోలీసుల సాక్షిగా మరొక వ్యక్తిని తెగబడి కొట్టాడన్నది తిరుగులేని సత్యం.

మనకందరికీ తెలుసు JNU తరహా చెత్త ఏమిటో. మనకందరికీ తెలుసు బర్ఖా వంటి ’రుడాలీ’లు చేసేదేమిటో. “దాడి చేయి…బూతులు తిట్టు…దొంగతనం బయటపడగానే ఏడుపుగొట్టు మొహాలు పెట్టు.” ఇదే వీరి రోజువారీ తతంగం. ఆ తతంగంలో భాగమే ఈ గుర్‍మెహర్ ప్లకార్డ్ ప్రదర్శన. ఇలా పూర్తవుతుంది కామ్మీ ఘట్టం.

ఒకరు మొదలెట్టగానే తతిమ్మా కామ్మీ గుంపులు చిలకపలుకులు పలకడం మొదలెడతాయి. ఎవరినైతే వీరు “రైట్ వింగర్స్” అని ఎకసెక్కాలాడుతారో, వారే నిజాల్ని బయటపెట్టారు. కామ్మీల బుర్రతక్కువ బఫూనరీని చోద్యం చూసినట్టు చూసి నవ్వుకున్నారు. ఈ RWలు గుర్‍మెహర్‍ను “ప్లకార్డ్ ఛాంపియన్” అని గుర్తుపట్టేసారు. దాంతో గతంలో ఆ అమ్మాయి పట్టుకున్న ప్లకార్డుల గుట్టల్ని తవ్వి పైకి తీసారు. ఈ ప్లకార్డుల్లోకెల్లా పరిహాసప్రాయమైన ప్లకార్డ్ ఒకటి వుంది. అదే “మా నాన్నని పాకిస్తాన్ చంపలేదు – యుద్ధం చంపిది.” ఈ ప్లకార్డ్ రేపిన నవ్వుల సునామీలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో భాగంగా “నేను సైతం ట్వీటునొక్కటి నొక్కి వదిలాను…”

గుర్‍మెహర్ తర్కం ప్రకారం ఈ బ్లాగ్ లో రాతలు నేను రాయడం లేదు…నా కీబోర్డ్ రాస్తోంది. RWవాలాలు కొన్ని కాదు ఎన్నెన్నో ప్లకార్డ్‍లను పుట్టించారు. చరిత్రలో ఎందరో చేసిన నేరాలను, ఘోరాలను వారు చేయనట్టుగా చూపించారు. “హిట్లర్ యూదుల్ని చంపలేదు – గ్యాస్ చంపింది”, “పేవ్‍మెంట్‍పై పడుకున్నవారిని సల్మాన్ ఖాన్ చంపలేదు – అతని SUV చంపింది”, “సల్మాన్ ఏ కృష్ణజింకనూ చంపలేదు – బుల్లెట్ చంపింది.”

ఇటీవలే, ఫ్రాన్స్ లోని నైస్ ప్రాంతంలో వాహనంతో గుద్ది ప్రజల్ని చంపిన ముస్లిమ్ టెర్రరిస్ట్ గురించి గుర్‍మెహర్ రాస్తే ఎలా వుండేది? “ప్రజల్ని చంపింది వాహనం – ముస్లిమ్ తీవ్రవాది కాదు.”

బహుశా రాడియాటేపుల కుంభకోణం చేసింది బర్ఖా మొబైల్ ఫోనే కానీ బర్ఖా కాదు!

మనందర్నీ పక్కన పెట్టేస్తే, చివరకు ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహవాగ్ కూడా ట్వీట్ చేయకుండా ఆగలేకపోయాడు. తాను సాధించిన త్రిశతకాలన్నీ తను చేయలేదని తెలుసుకున్నాడు. చివరకు అతను, గుర్‍మెహర్ మరియు ఆమె కామ్మీ రథసారథులు వాక్రుచ్చిన విధంగా, ఇదిగో ఇలా నిజాన్ని ఒప్పేసుకున్నాడు:

పక్కవారిలాగానే నేను కూడా అభ్యుదయవాదినే. దేశానికి వ్యతిరేకం కాని నీచమైన నినాదాల్ని భరించగలను. అలాగని, దేశద్రోహుల్ని, తీవ్రవాదుల్ని పొగిడే పొగడ్తలని ఏ మాత్రం సహించను. JNU మూర్ఖులు సరిగ్గా ఏది చేయకూడదో వాటినే చేస్తారు, అదే తమ వాక్‍స్వాతంత్ర్యమని హుంకరిస్తారు. ఇటువంటి వారిని చక్కగా నియంత్రిస్తారు బర్ఖా, కేజ్రీవాల్, యేచూరి వంటి కామ్మీయులు.

గుర్‍మెహర్ ఉదంతం చూసాక, కమ్యూనిస్ట్ దుర్బోధల వల్ల, అపసిధ్దాంతాల వల్ల యువతరానికి జరుగుతున్న ద్రోహం ఏమిటో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఓ కార్గిల్ అమరయోధుని కుమార్తె కమ్యూనిస్టుల కుతంత్రాల్లో ఎలా భాగమయిందో తెలుసుకోవాలి. కమ్యూనిస్టులు చూపే ఈ తరహా ప్రతిభను చూసిన నిరాశపడుతున్నాను. వీరి ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి (నిడివి 2.12 నిముషాలు).

పై వీడియోలో కనబడే “అభ్యుదయవాద ఉదారశీలి కళాకారు”నిలా (Progressive Liberal artist), భారతదేశపు కామ్మీ మూర్ఖులు ఆర్టీ-ఫార్టీ నేర్పరులు. వారి నుండి బయటికొచ్చే మాటలు, రాతలు, చేష్టలు వగైరా వగైరాలు “waste of their life” తప్ప మరొకటి కావు. నేనేమీ ఫిర్యాదు చేయడం లేదు. త్వరలో ఈ కామ్మీ ఆర్టీ-ఫార్టీలు తమ ’అపానవాయు కళ’ను అదే పనిగా వెలిగక్కి మాయమైపోతారు. ఈలోపు వారిని మరి కొంత “అపానవాయు”వీకరించనివ్వండి.

 @@@@@@

Your views are valuable to us!