నిరుపేద రాణులు

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]

 


This is a Telugu translation of original article by author Ravinar published at MediaCrooks.com .

Link to original article : Poverty Queens


అంబానీ సోదరులు టెలికామ్ వ్యాపారంలో ప్రవేశించాలని అనుకున్నారు. అప్పుడు వారు తమ తండ్రి ధీరుభాయ్ అంబానీ వద్దకు సలహా కోసం వెళ్ళారు. అప్పటికే ధీరుభాయ్ ఆరోగ్యం బాగా దెబ్బతినివుంది. రిలయన్స్ సంస్థలకు ఆయనే అధిపతిగా ఉన్నా అతని కుమారులే అన్ని పనుల్నీ చక్కదిద్దేవారు. తన సలహా కోరుతూ వచ్చిన కొడుకులకు ధీరూభాయ్ చెప్పిన మాటలు ఇవే –  “చోర్ వాడ్ నుంచి ముంబైకి 40 పైసలకే ఫోన్ కాల్ చేయ్యగలిగితేనే మీరు రంగంలోకి దిగండి. లేదంటే వద్దు.” ఇందుకు సంబంధించిన మరో కథనంను ఇక్కడ చదవండి.

చోర్ వాడ్ అంబానీల పుట్టినిల్లు.  ప్రముఖ పుణ్యక్షేత్రం “సోమనాథ ఆలయం” చోర్ వాడ్ బీచ్ కు చాలా దగ్గరలో ఉంది. అక్కడ పుట్టిన ధీరూభాయ్ కు పేదరికం అంటే ఏమిటో తెలుసు. కొళాయిలో రాని నీళ్ళు, ఎప్పుడు వస్తుందో తెలియని విద్యుత్ సరఫరా, ఆకలి,  రవాణా  సౌకర్యాలు లేకపోవడం – ఇవన్నీ అతను చిన్నతనంలో అనుభవించాడు. ఈ కారణం చేతనే అతను వ్యాపార రంగంలో ’నిరుపేదలే’ తన వినియోగదారులుగా చేసుకున్నాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూపంలో అంబానీలు టెలికామ్ వ్యాపారం ప్రారంభించినప్పుడు చోర్‍వాడ్ నుండి ముంబైకు చేసే ఫోన్ కాల్ ఖర్చు నిముషానికి నలభై పైసలు మాత్రమే ఉండేది.

అప్పటి నుండి ఇప్పటి కాలానికి వస్తే, ఈనాడు చాలవరకు మధ్యతరగతి ప్రజలు పేదరికపు హద్దుల్ని దాటి పైకి ఎదిగారు. వీరులో ధనికులుగా మారినవారు ఇప్పటికీ పొదుపుగా జీవనం సాగిస్తున్నారు. వినయంతో ప్రవర్తిస్తున్నారు. ధీరూభాయ్ కూడా ఆడంబరాలకు పోలేదు. కానీ అతని కుమారుల జీవన శైలి అందుకు భిన్నం. వారు తమ తండ్రిలా పేదరికంలో పుట్టలేదు. గూగుల్ సంస్థ అధిపతి సుందర్ పిచాయ్ కూడా బీదరికపు నేపధ్యం నుండి వచ్చినవాడే. ఈనాడు కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి యథార్థ కథలు ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయి.  ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడి కూడా సాధారణ కుటుంబం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగి ఇప్పుడు కేంద్రప్రభుత్వ సారథిగా అందలం ఎక్కాడు. ధీరుభాయ్ కానీ, సుందర్ పిచాయ్ కానీ లేక నరేంద్ర మోడీ కానీ – వీళ్ళందిరికీ ఉన్న పోలిక వారి అత్యంత సాధారణమైన నేపధ్యం. వీరికి బీదరికం అంటే ఏమిటో తెలుసు. ఆకలి అంటే ఏమిటో తెలుసు.

ఇందుకు భిన్నంగా, నోట్లోనే కాదు దేహంలోని అన్ని భాగాల్లోనూ బంగారు, వెండి నింపుకునే పుట్టి పెరిగిన విలాసవంతుడు, అహంకారి అయిన రాహుల్ గాంధీ లాంటి వాడు పేదరికం గురించి మాట్లాడ్డం హాస్యాస్పదమైన విషయం. చీటికి మాటికి యూరోపు లోనో, థాయ్‍లాండ్ లోనో గోల్ఫ్ ఆడ్డానికి మాయమైపోయే రాహుల్ గాంధీ పేదరికం గురించి వల్లించేవన్నీ అతని స్వానుభవంతో చెప్పేవి కావు. అవి ఎవడో ఘోస్ట్ రైటర్ రాసిచ్చిన పిచ్చి మాటలే తప్ప మరొకటి కాదు. పుట్టు ధనికుడైన రాహుల్ గాంధీ పేదరికం అంటే ఏమిటి అని ఉపన్యాసాలు దంచడం పేదల్ని అవమానించడమే!

ఎంతో ఆశతో మొదలుపెట్టిన రఫాల్ కుంభకోణం ప్రచారం బోల్తా పడిపోయింది. అంబానీలకు మోడీ 3,000 కోట్లను దోచిపెట్టాడని ఊదరగొట్టినా ఎవరూ నమ్మలేదు. ఇలా ప్రచారాస్త్రాలన్నీ పడిపోవడంతో దిక్కు తోచని నకిలీ గాంధీలు తమ పాత నినాదమైన “గరీబీ హటావో”ను మళ్ళీ నెత్తికెత్తుకున్నారు.

 

పై ట్వీట్ ను మరొక్కసారి చదవండి!

“కొత్త ఇండియా”, “పాత ఇండియా”, “రెండు హిందుస్థాన్‍లు” – ఏమిటీ చెత్త? ఈ ట్వీట్ లో ఉండే భాష రాహుల్ గాంధీ మామూలుగా వాడే భాష కానే కాదు. ఇదంతా స్టీవ్ జార్డింగ్ అనే విదేశీయుడి ఉచ్చిష్టం. ఇతన్ని ఈ మధ్యనే నకిలీ గాంధీల ప్రచార వ్యూహకర్తగా అమెరికా నుండి దిగుమతి చేసుకున్నారు. పై ట్వీట్ లో వాడిన “scourge” (ఆపద/ఉపద్రవం) అన్న పదం రాహుల్ జీవితంలో ఉపయోగించి ఎరుగడు. అ పదానికి అర్థం అడిగితే చెప్పలేక పోవచ్చు. ఈ నకిలీ గాంధీలకున్న దరిద్రం ఒక్కటే – పనికొచ్చే ఆలోచనలు చేయలేకపోవడం.  నీతి నిజాయితీలు లేకపోవడం. లేకపోతే నాన్నమ్మ ఇందిరాగాంధీ యాభైయేళ్ళ క్రితం అరిచిన అరుపుల్నే ఇప్పుడు ఈ దొంగ గాంధీ అరువు తెచ్చుకోవడం ఎందుకు జరిగేది?

నిజానికి మోడీ ప్రభుత్వం నాలుగేళ్ళలో దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వాళ్ళను పైకి తీసుకు వచ్చేందుకు బాగానే కృషి చేసింది. పేదరిక నిర్మూల దిశగా బిజేపి ప్రభుత్వం వేగంగానే అడుగులు వేస్తోంది.  దీనితో పోలిస్తే కేంద్రంలోను, అనేక రాష్ట్రాలలోను 70 ఏళ్ళు అధికారం వెలగిన బెట్టిన నెహ్రూ-గాంధీ కుటుంబం చేసింది చాలా తక్కువనే చెప్పాలి. 2014లో  14 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే 2018 నాటికి 73 కోట్ల మంది మాత్రమే బి.పి.ఎల్ రేఖ క్రిందనున్నారు. ఈ లెక్కన మోడీ ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తోంది. ఒక్క భారతీయ పరిశీలకులే కాక వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇవే అంకెల్ని పేర్కొంటున్నాయి. కేంద్రప్రభుత్వ కృషిని గుర్తించాయి. మొన్నమొన్నటి వరకూ దరిద్రులెక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానం లో ఉండేది. ఇప్పుడు నైజీరియా ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది.

విద్యుత్ రంగం. గ్యాస్, నిర్మాణ రంగం. రవాణా వ్యవస్థ లాంటి అనేక విషయాలలో మోడీ ప్రభుత్వం శ్లాఘనీయమైన ప్రగతిని చూపించింది.  పేదలకై ప్రత్యేకమైన జీవిత బీమా, తక్కువ ధరలకే మందులు వంటి పథకాలతో మోడీ సర్కార్ ఆశించినదాని కంటే మెరుగ్గానే పని చేసింది.

“దరిద్రుల పాలిటి దేవత”లమని నకిలీ గాంధీలు డప్పు కొట్టుకోవడం వారి జమిందారీ-బ్రిటీషు శైలి పెంపకం వల్ల జరుగుతోంది. ఎండా కాలంలో నిప్పు కొలిమిగా మారే నాసిరకపు ఇంట్లో, కరెంట్ లేకుండా, ఫ్యాన్ తిరగకుండా అల్లల్లాడి పోయే బీదల పాట్లను తమ జీవితకాలంలో కనీసం ఒక్క వారం రోజులైనా చవి చూడని వారు ఈ నకిలీ గాంధీలు. విలాసాలకు చిరునామాగా, వినోదాలకు పెట్టిన పేరులా జీవించే వీళ్ళా పేదరికం గురించి మాట్లాడేది? వీళ్ళ బొంద!

ఇక నెహ్రూ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మేలు. ఈ మనిషి మన దేశానికి చేసిన హాని గురించి చెప్పి చెప్పి విసిగిపోయాను.  ఒక్క ముక్కలో చెప్పాలంటే, అప్పటి ప్రపంచ ప్రగతితో పోలిస్తే నెహ్రూ మన దేశాన్ని యాభైయేళ్ళ వెనక్కు నెట్టేసాడు.  సంజయ్ గాంధీ లాంటి మోసగాడి పేరు మీద పోస్టల్ స్టాంపులు వచ్చాయి. ఎన్నో సంస్థలకు, భవనాలకు అతని పేరును పెట్టారు. దేశానికి ఇతను చేసిన సేవ ఏమిటి? గుండు సున్నా!  నామకరణం అప్పుడు “సంజీవ్”గా ఉన్న అతని పేరు ఎందుకు “సంజయ్”గా మారిందన్న ఒక్క విషయం చాలు ఈ కుటుంబం వెనకాలవున్న రహస్యాలను అర్థం చేసుకోవడానికి. వారు వేసుకునే దుస్తుల్ని చూడండి. రాహుల్ వేసుకున్న Burberry jacket విలువ డెబ్బై ఐదు వేల రూపాయాల పై మాటే. ప్రియాంకా గాంధీ కూడా ’స్టైల్ స్టేట్మెంట్స్’ ఇవ్వడంలో వెనకబడి లేదు. ఈ లంచగొండి కుటుంబంలోని ఏ ఒక్కరూ ఒక్కపూట కూడా బీదతనంలో గడపలేదు.

బీదతనంను అర్థం చేసుకోవడానికి బీదలే కానవసరం లేదు.  ఎందుకంటే రోగం గురించి తెలుసుకోవడానికి డాక్టర్ రోగి కానవసరం లేదు.  లేదు…లేదు…బీదరికం గురించి బీదలే మాట్లాడాలని వాదిస్తే అది పిచ్చిదనం అవుతుంది. కానీ పై చెప్పుకున్న డాక్టర్ ఉదాహరణకు, నకిలీ గాంధీలకు మధ్య పెద్ద తేడా ఉంది. ఒక డాక్టర్ వైద్యం చేయడానికి ఎన్నో సంవత్సరాల పాటు చదువుకుని, పరీక్షలు రాసి, పట్టాను పుచ్చుకుంటాడు. కానీ ఈ దొంగ గాంధీలు కోటీశ్వరులుగా పుట్టి, విలాసవంతంగా పెరగడమే నేర్చుకున్నారు. వీరు డబ్బున్న వాళ్ళు కావడం పట్ల నాకెలాంటి ఈర్ష్య లేదు. వ్యాపారం చేసో, వంశపారంపర్యంగానో, పెళ్ళిళ్ళ ద్వారానో వారు ఆ డబ్బును సంపాదించివుంటే అది వారి కష్టార్జితం అని చెప్పొచ్చు. కానీ వీరి సంపాదన అలాంటిది కాదు. రాహుల్ గానీ అతని బావ వాద్రా గానీ ఒక్కరోజు కూడా పేదల కోసం పని చేసిన వారు కారు. వారు చేసిందల్లా ’పేదరికపు పిక్నిక్.’ బీదవాళ్ళను కావలించుకుని దొంగ కన్నీళ్ళు పెట్టడం.

మళ్ళీ చెబుతున్నాను. వారి ఆస్తుల్ని చూసి నాకెలాంటి కడుపుమంట లేదు. వాళ్ళ ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించడం తప్పు కాదు. కానీ పేదవాళ్ళ నుద్ధరించడానికే అవతరించామని చెప్పుకునే వాళ్ళ నడవడికలో ఆ సంస్కారం కనబడాలి. అయితే, ఈ నకిలీ గాంధీలు చెప్పేదొకటి, చేసేదొకటి. వారి జల్సాలు, ఖరీదైన విందులు, వినోదాలు, రహస్య విహార యాత్రలు – ఇవేవీ కూడా పేదలను ఉద్ధరించే పనులు కావు.

రా.గాం. ఎన్నో ’పేదరికపు పిక్నిక్”లను చేసాడు. ఒక్కడే పోకుండా ఒక బ్రిటీషు మంత్రిని వెంటబెట్టుకుని తిరిగాడు. ’కళావతి’ అన్న పేదరాలి ఇంట్లో తన అనుభవాల్ని పార్లమెంటులో కథలు కథలుగా వర్ణించి చెప్పాడు. దళితులతో సహపంక్తి భోజనాలంటూ ఫోటోలు దిగుతాడు. కానీ నిజానికి వారికేం చేసాడు అని అడిగితే “ఏమీ లేదు” అన్నదే సమాధానం. ఈవిధంగా, పేదరికం అంటే ఏమిటో బొత్తిగా తెలియని వాళ్ళు, బీదలంటే సహానుభూతి లేని వాళ్ళు, అలాంటివాళ్ళను కాపాడలన్న చిత్తశుద్ధి లేని వాళ్ళు ఈ నకిలీ గాంధీలు. వీళ్ళకు కావల్సింది పేదల అభ్యున్నతి కాదు. అంతులేని అధికారం మాత్రమే. ఆ అధికారాన్ని పొందడానికి ఏమైన చేయడానికి, వెర్రిమొర్రి పథకాల్ని ప్రకటించడానికి వెనకాడరు వీళ్ళు. వీరి అబద్ధాలను ప్రచారం చేయడానికే మీడియాలోని కొన్ని వర్గాలు ఉన్నాయి. వీళ్ళు ఆ దొంగల్ని ఏమీ అడగరు.

కొత్త కోచ్ స్టీవ్ జార్డింగ్ తర్ఫీదులో రా.గాం.  నరేంద్ర మోడీని అవినీతిపరునిగా చిత్రించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఫలితం దక్కడం లేదు. అందుకని, Universal Basic Income (UBI) అంటూ ఒక కొత్త పాటను ఎత్తుకున్నాడు. అక్కడికేదో ఈ బుడుతడు తన ఆర్థక ప్రయోగశాలలో 7.86 రోజులు కష్టపడి కనుక్కున్న ఫార్ములాలా “యురేకా…యురేకా” అని అరుస్తున్నాడు. ఇది చూసి NDTV, IndiaToday వంటి ఛానల్స్ లో ఉన్న అతని బానిసలు ఎగిరెగిరి గంతులేస్తున్నారు.  అసలు విషయమేమిటంటే, మోడీ సర్కార్ ఎప్పుడో UBI పై కసరత్తును మొదలుపెట్టింది. కనుక UBI కేవలం ఒక “అమలు కావల్సిన ఉన్న పథకం” మాత్రమే కానీ రాహుల్ గాంధీ కనిపెట్టిన కొత్త పథకం కానే కాదు.

 

ప్రజలు వెర్రివాళ్ళు కారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువకాలం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అనుభవించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయాలుగా వేరే పార్టీలు ఎదగడానికి చాలా సమయమే పట్టింది. ఎందరో ప్రతిపక్ష నాయకుల్ని ద్రోహులుగా చిత్రీకరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. అంతేకాదు, తనను విమర్శించిన వాళ్ళను జైల్లోకి తోయించాడు నెహ్రూ.  ఆ కాలంలో కాంగ్రెస్ ను, నెహ్రూ-గాంధీ కుటుంబాలను ప్రశ్నించే మీడియా లేకుండా పోయింది.  నెహ్రూ-గాంధీ కుటుంబీకులు ఒక రకపు రాణులు…..”పేదరికపు రాణులు.”

సేవ చేయడానికై ఉన్న రాజకీయాలను ఒక వృత్తిగాను, సంపాదించే మార్గంగాను తయారు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది.  ఈ పార్టీ ద్వారా ఎంతోమంది రాజకీయాలు చేసి అడ్డుగోలుగా డబ్బు సంపాదించారు. పేదల్ని మరింత పేదలుగా మార్చడం కూడా ఈ అక్రమార్జనలో భాగమే. కాంగ్రెస్ పాలనా కాలంలో దరిద్రం నుండి బయటపడినవారు ఎవరైనా ఉంటే అది వారి స్వశక్తితో తెచ్చుకున్న మార్పే తప్ప కాంగ్రెస్ చేసిన గమ్మత్తు ఏదీ లేదు.  ఈ అడుగుజాడల్నే అనుసరించి నడిచే లాలూ యాదవ్, శరద్ పవార్, మాయావతి, ములాయమ్‍లు ఆగర్భ శ్రీమంతులుగా మారారు. వీళ్ళ పాలనలో పేదలు పేదలుగానే మిగిలారు. ఈ ’దరిద్రపు రాజకీయాలే’ కాంగ్రెస్ పార్టీ, నకిలీ గాంధీలు ఈ దేశానికి అందించిన బహుమతి. ఎన్నో సంవత్సరాలుగా గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రే బరేలి, అమేథీ నియోజకవర్గాలు ఘోరమైన దరిద్రానికి చిరునామాలుగా ఇప్పటికీ నిలచివున్నాయి.

వాజపేయి, మోడీలు మాత్రమే అవినీతి రహితులైన కాంగ్రేసేతర ప్రభుత్వాధినేతలు. వీరి ప్రభుత్వాలు మాత్రమే అవినీతి పంకిలం అంటని పథకాలను అమలు చేసారు. మరోవైపు, దేశంలోని పేదల దుర్భర పరిస్థితులకు ఇందిరాగాంధీ మొదలు సోనియా వరకూ నకిలీ గాంధీ కుటుంబమే కారణం. వీరి వల్లనే “దరిద్రులను కాల్చుకు తినడం” ప్రారంభమై, నిరుపేదలు మృత్యులోయలోకి జారిపోయారు. ఇప్పుడు ఈ కుర్ర నకిలీ గాంధీ గరీబీ హటావో అంటూ ’బీద అరుపుల్ని’ అరుస్తున్నాడు.  బట్టలు లేని నిర్భాగ్యులకు పైజమా లాడీని అందిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సలహాదారుడైన మాంటెక్ అహ్లూవాలియా అక్షరాలా 35 లక్షల రూపాయల్ని ఖర్చు పెట్టి తన ఆఫీసు మరుగుదొడ్డిని మరమ్మత్తు చేయించుకున్నాడు. అలాంటి ఖరీదైన మరుగుదొడ్డిలో కూర్చుని, అతను పేదల గురించి ఆలోచిస్తాడు. ఇదీ కాంగ్రెస్ సంస్కృతి. సంప్రదాయం! దోపెడీ దొంగలైన కాంగ్రెస్ నాయకులందరూ కలిసినా కట్టనన్ని మరుగుదొడ్లను మోడీ ప్రభుత్వం నాలుగేళ్ళలో కట్టించింది.

నేను నా కుటుంబం కూడా పేదరికపు లోతుల్నుండే పైకి ఎదిగాం. కనుక ఈ మేడిన్-చైనా నకిలీ గాంధీలు చెప్పే దొంగ సూక్తుల్ని నమ్మడానికి సిద్ధంగా లేము. దరిద్రుల్ని ఉద్ధరిస్తాననే ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే – “ప్రాథమిక విద్య నుండి కళాశాల చదువుల వరకూ పేదలకు ఉచిత విద్యను అందించండి.’ చదువు వల్ల పేదరికం తగ్గుముఖం పడుతుంది. పేదరికపు అనుభవం ఉన్న నాకు, నాలాంటి వారికి నీతులు చెప్పడానికి ఈ నకిలీ గాంధీలు, వారి చెంచాలు, దొంగ నేతలు అవసరం లేదు. పుట్టు ధనికులు, చిత్తశుద్ధి లేని దోపిడీదారులైన వీళ్ళు నిజమైన బీదవాళ్ళతో ఆడుకొంటున్నారు. అపహాస్యం చేస్తున్నారు.

కనుక ఎప్పుడైనా సరే, నేను మోసకారి ’పేదరికపు రాణులై’న రాహుల్ గాంధీని, ప్రియాంకా వాద్రాను నమ్మను. బదులుగా, పేదరికపు లోకం నుండి వచ్చిన నరేంద్ర మోడీ లాంటి వారికి మద్దతునిస్తాను. సంవత్సరంలో సగభాగం విదేశాల్లో విలాసాలను అనుభవించి, మిగిలిన రోజుల్లో భారతీయులకు పేదరికం గురించి ప్రవచనాలు చెప్పే దొంగల్ని నేను నమ్మను. ఈ బందిపోట్లను తాము సంపాదించిన వెండి చెమ్చాలను  నములుతూ కూర్చోనివ్వండి.

Order In INR     Order in US$

 

Your views are valuable to us!