Original Author: Ravinar, MediaCrooks.com Telugu Translation: C. Raghothama Rao
Read original article on MediaCrooks.com – Link >> Sickular Kabristan
అదొక తెలివైన పన్నాగం.
తండ్రి-కొడుకు జంటగా ’కుటుంబ పోరాట’మనే నాటకాన్ని ప్రజల కోసం ప్రదర్శించారు. దీన్ని కామ్మీ మీడియా ఓ గొప్ప నవోదయంగా పొగిడేసింది. మీడియాలోని అనుమానితుల్లో దాదపు అందరూ అఖిలేశ్ యాదవ్‍ను యు.పి. ’వికాస’ పురుషునిగా చిత్రీకరించడం మొదలెట్టారు. ఆ చిట్టి కుర్రోడు “కామ్ బోల్తా హై” (పని మాట్లాడుతుంది) అన్న గూడును చుట్టూ అల్లుకున్నాడు. ఈవిధంగా, గత ఐదేళ్ళలో అఖిలేశ్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి హయాంలో జరిగిన దారుణాలను, హత్యలు, మానభంగాలను, కిడ్నాపులను – ఒక్కటేమిటి? సమస్త నేరాలను మసిపూసి మారేడు కాయ చేసి, అటకెక్కించాలన్న ప్రయత్నాల్ని చేసారు మీడియా మూర్ఖులు. అఖిలేశ్‍ను యువతరం ప్రతినిధిగా భుజాని కెత్తుకున్నారు. అఫ్‍కోర్స్, ఈ యువప్రతినిధి మరొక ఎవర్‍గ్రీన్ యువకుడు రాహుల్ గాం. తో జట్టుకట్టాడులేండి!
పై విషయాన్ని, జర్నలిస్టునని చెప్పుకునే పొలిటికల్ డీలర్ శేఖర్ గుప్తా కంటే నొక్కి చెప్పేవారు లేరు:
గుప్తా ఎలా అఖిలేశ్‍ను పొగిడాడో జాగ్రత్తగా గమనించండి. ఈ మీడియా మూర్ఖునికి, అఖిలేశ్ నేరపూరిత రాజకీయాల్ని నిర్మూలించే మహానుభావునిగా కనిపించాడు. ఇదీ ఈ ’జర్నలిస్ట్ డీలర్’ మనకు చెప్పదల్చిన ’సోది!”
చెప్పుల్ని నాకే జాతికి చెందిన వీరు తమ కూతల్ని ట్వీట్స్ ద్వారానే కాక మీడియా ద్వారా కూడా చెప్పాల్సిన అవసరం వారికి ఉంది. సుమారు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, అంటే నవంబర్ 2015లో, అఖిలేశ్ యాదవ్‍తో “Walk The Talk” కార్యక్రమాన్ని నిర్వహించాడు శేఖర్ గుప్తా. ఇది చాలదన్నట్టు, సరిగ్గా ఎన్నికల సమయంలో, అందులోనూ చివరి దశలో, మళ్ళీ ‘Walk The Talk’ను అదే అఖిలేశ్ తో నడిపాడు శేఖర్.
తెలివి…అతి తెలివి!
ఎన్నికల ఫలితాలను చూస్తే చాలు, ’దాద్రి’ సంఘటనను అతిగా వాడుకున్నందుకు ఎవరి మొహాలపై డైనోసార్ గుడ్లు పడ్డాయో స్పష్టంగా తెలుసుస్తోంది. శేఖర్ ఒక్కడే చాలడన్నట్టు, అతని మాజీ-మీడియా పార్ట్‍నర్ కూడా యూపీలో షికార్లు కొట్టింది. అబద్ధాలకోరు, అయోగ్యుల ప్రచారకర్త అయిన ఈమె మోడి, బిజేపిల్లోని తప్పుల్ని వెదికి పట్టుకుని యూపీ ప్రజల్ని వెర్రివాళ్ళను చేయడానికి తెగ ప్రయత్నం చేసింది:
ఎంత అద్భుతంగా ప్రయత్నించినా, పై కనబడుతున్న యూపీ రైతును మోసగించలేకపోయింది బర్ఖా. ఎందుకంటే, నిజంగా బీదల పక్షాన నిలబడింది ఎవరని ఆ రైతుకు తెలుసు. అయినా సరే, ఎన్నికలకు ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనందుకు బిజేపి దారుణంగా దెబ్బతింటుందని ఆ రైతు చేత చెప్పించడానికి నానా తంటాలు పడింది బర్ఖా. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఈ ’పరిణామ శాస్త్రవేత్త’ (Evolutary Scientist)కు పెద్ద చెంపపెట్టులాంటివి.
పప్పు, కేజ్రీవాల్, హిల్లరీ, గుర్‍మెహర్, అఖిలేశ్ – వీరి తరువాత ’పరిణామ’ దశకు వచ్చేవారెవరు? ఎవరు ఈమె చేతిలో నాశనం కావల్సివుంది? ఇటువంటి వారికి మంటపుట్టించే విషయాలైనా ఏవి?
నన్నడిగితే, బిజేపికి ఇతర రాజకీయ పార్టీలకు పెద్ద తేడాలైతే లేవు. బిజేపి సహా అన్ని పార్టీలు ’సోషలిజమ్’ను నెత్తికెత్తుకున్నవే!
కానీ, బిజేపికి ఇతర పార్టీలకు మధ్య స్పష్టమైన తేడాలు మూడు ఉన్నాయి. (1) ఇతర పార్టీల్లా బిజేపి నిలువెల్లా అవినీతి మయమయింది కాదు (మోడి ఏమాత్రం అవినీతిపరుడు కానేకాడు), (2) అభివృద్ధి, ఆచరణలో బిజేపికి ఉన్న దూరదృష్టి ఇతరులకి లేవు. ఇవి కాక చివరిది, అతిముఖ్యమైనది (3) కాషాయ వర్ణం. కామ్మీయుల అరుపులు, కేకలు తప్పించి, నిజానికి, బిజేపి అధికారాని వచ్చాక ’హిందూత్వం’ పేరుతో చేసింది ఏమీ లేదు. వారు త్వరలో కొన్ని ’హిందూత్వ’ పనులు తప్పక చేయాలని నేను ఆశిస్తున్నాను. కామ్మీ పందలు ఎల్లకాలం వాళ్ళ మొహాలపై ప్రదర్శించే ఏడుపు ఒక్కటే. అదే – “ముస్లిమ్ అది…ముస్లిమ్ ఇది!” ముస్లిమ్‍లకు టికెట్ ఇవ్వలేదు…బిజేపి పాలనలో ముస్లిమ్‍లకు రక్షణ లేదు. ఇవే వారి ’ప్రలాప ప్రహసనం’లోని అధ్యాయాలు!
కానీ వీరి అపప్రచారాలు మట్టి కరవడం తథ్యం.
మీడియా మూర్ఖులు ప్రచారం చేసిన కొన్ని క్రిమినల్ అబద్ధాలను చూడండి:
డీమనిటైజేషన్ విఫలమయిందని లేదా ప్రజల్లో కోపావేశాలు ఉన్నాయని లేదా అరవింద్ కేజ్రీవాల్‍ను పొగిడేందుకు ముసుగేసుకున్న ఆప్-మూర్ఖులు. ఈ ప్రచారాలేవీ అనుకోకుండా జరిగినవి కావు. కాకతాళీయమైనవీ కావు. ఇవన్నీ ఓ పద్ధతి ప్రకారం చేసిన విషప్రచారాలు. వీటి ఉద్దేశం – ప్రజల్ని దిక్కు తప్పించడం. బిజేపి పాలనలో తమకు మంచి జరగడం లేదనే అపోహను సృష్టించడం. అరిగిపోయి, తుప్పుపట్టిన కాంగ్రెస్, సమాజ్‍వాది, బహుజన్ సమాజ్‍వాది పార్టీల వంటివే తమకు దిక్కు అని ప్రజలు భావించేలా చేయడమే ఈ అబద్ధపు ప్రచారల అసలు లక్ష్యం. బిజేపి తప్ప మిగిలిన రాజకీయ ముఠాల వల్లనే అభివృద్ధి సాధ్యమని మభ్యపెట్టేందుకే ఇవి పుట్టుకొచ్చాయి. ఇంకొక కారణం కూడా లేకపోలేదు. కాంగ్రెస్ తదితర ముఠాల్లా ప్రధాని మోడి మీడియా పందలను మేపడం లేదు. “తనను సమర్ధించే జర్నలిస్టులకు అద్భుతమైన వరాలను కురిపిస్తా”నని ప్రకటించే స్థాయికి వెళ్ళిపోయాడు అఖిలేశ్ యాదవ్. కానీ ప్రపంచవ్యాప్తంగా కామ్మీ మీడియా ధ్వంసమైపోతోంది. ప్రజల విమర్శలకు, వ్యంగ్యానికి, గేలికి గురి అవుతోంది ఆ మీడియా.
ఈ కామ్మీ మీడియా మూర్ఖుల వదరుబోతుదనానికి ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. రసిక రాజకీయ స్వప్నాలు, స్వార్థంతో నిండిన ఆలోచన – ఇవే వారి పునాదులు. ఉత్తరప్రదేశ్ 325 సీట్లను భా.జ.పా కు ఇవ్వడంలోనే తెలుస్తోంది వీరి మూర్ఖపు కూతల్ని, సిగ్గులేక చెప్పే అబద్ధాల్ని ప్రజలు నమ్మడం లేదని. ఈ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయి ఈ మీడియా శిఖండులకు వారి నగ్నదేహాల్ని వారికే చూపాయని.
ఎప్పుడెప్పుడు తమ పోషకులు (Paymasters) తమ పెట్టుబడిని పోగొట్టుకుంటారో, అప్పుడప్పుడు ఈ మీడియా మందబుద్ధులు మరింత వికారమైన సంజాయిషీలతో, ఏడ్పులతో పెడబొబ్బలు పెడతారు. ఏదో మాగజైన్‍కు పనిచేసే నీరజా చౌధరి అని ఓ జర్నలిస్టు వుంది. ఈవిడొక పరువు లేని పత్రికా విలేకరి. “రాష్ట్రాల్లోను, స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలకు ప్రధానమంత్రి ప్రచారం చేయాలా?” అని అడిగింది ఈ మందబుద్ధి. “మన దగ్గరవున్న మంచి యోధుణ్ణి, ఆయుధాలతో సహా, యుద్ధరంగానికి పంపాలా?” అని అడిగినట్టుగా ఉంది ఇది. అతడెవడో, ప్రశాంత్ ఝా అట, NDTV-రాజ్‍దీప్ విషవలయానికి చెందిన హిందూస్తాన్ టైమ్స్ కు చెందినవాడు. ఇతను, ఎకనమిక్స్ టైమ్స్‍కు చెందిన రోహిణీ సింగ్ అనే ’సబ్రీనా’కు వంత పాడే ’సల్మా’ పాత్రను పోషించాడు. ఈ మూర్ఖులందరూ కట్టగలసి చిమ్మిన విషం ప్రజల గేలికి గురయింది:
ఎకనమిక్స్ టైమ్స్ లో పనిచేసే జర్నలిస్టులు అనబడే ’చరణదాసులు’ అఖిలేశ్ యాదవ్ బానిసలుగా మారారు. అతని కోసం ప్రతిచోట ప్రచారం చేసారు. వీరి విపరీత చేష్టలకు విసుగెత్తిన కొందరు వీరి ట్విటర్ హ్యాండిల్స్‍కు పేరడీ అకౌంట్లను సృష్టించారు. జర్నలిస్ట్ ప్రమాణాలను అమ్మకానికి పెట్టిన వెధవలను అనుకరించి, గేలి చేసారు. తమకు తాయిలాలను పంచిపెట్టిన రాజకీయ బాసుల పాదసేవలో తరించిన మీడియా మూర్ఖుల అంచనాలు తప్పాయీ అంటే తప్పకుండా ఎలావుంటాయి? నీతి, నిజాయితీ, నిక్కచ్చిదనం లేని వారి మాటలు గాలి మూటలే కాదా? వీరి మూర్ఖపు సొల్లు వాగుడు కంటే మారుమూల పల్లెలో ఉండే ఓ సాధారణ వ్యక్తి మాటలే లాజికల్‍గా ఉంటాయి. నిజాన్ని పట్టి చూపిస్తాయి. అటువంటి సాధారణ ప్రజల్ని ఈ మూర్ఖులు మోసం చేయబోయి తామే మోసపోయారు. బొక్కబోర్లా పడ్డారు.
ఇహ కాంగ్రేస్ లోని ’పాదసేవకులు’ సోనియా, ప్రియాంకాల ’శాశ్వత కొంగును పట్టువారు.’ వారి చిన్నారి పప్పు (రాహుల్ గాం.) ఎందుకూ కొరగాని వాడైపోవడంతో ప్రస్తుతం వారు కాపడవలసిన ’దివ్య హస్తం’ ప్రియాంకా వాడ్రా. ఇటీవలి ఎన్నికల్లో ఈ ’వానాకాలపు కప్ప’ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలీదు. నకిలీ గాంధీల చిట్టిపొట్టి రాజ్యానికి ఎక్కడలేని హాని జరిగిపోయింది. వాళ్ళు తమ ’కంచుకోట’గా భావించి, ’స్వంత ఆస్తి’లా వాడుకున్న అమేథీ నియోజకవర్గంలో జరగాల్సిన నష్టాలు ఈనాటి ఎన్నికల్లో జరిగిపోయాయి. కానీ ఓహ్! ప్రియాంక గనుక మరింత ఎక్కువగా ప్రచారం చేసివుంటే – అద్భుతాలు జరిగిపోయేవి. ఇప్పుడు తెచ్చుకున్న 6 సీట్లకంటే 50% ఎక్కువ, అంటే 9 సీట్లు వచ్చేవి. ఇది కాంగ్రెస్ లోని ’ శాశ్వత కొంగును పట్టువారు’ పలికిన పలుకులు. ఈ వదురులో వీసమైనా సత్తువ ఉందా?
2014 ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ ప్రచారమే చేయలేదా? బాగా చేసింది. అందులో భాగంగా ఇటుకరాళ్ళ గుట్టలపై ఎగిరెగిరి దూకింది. అలా ఎన్నికల ప్రచారంలో తన నైపుణ్యాన్ని చూపించింది కూడా. అయినా సరే, ఆ ఎన్నికల్లో కాంగ్రేస్‍కు దక్కింది ఏదీ లేదు. అప్పటికి, ఇప్పటికి కథలో మార్పు ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ చావనైనా చావాలి లేదా చైనా గాంధీలను తన్ని తగలెయ్యాలి. భారతీయులతో ఏవిధమైన అనుబంధ బాంధవ్యాలు లేని దొంగ గాంధీల వల్ల ఆ పార్టీకి దొరికేది చిప్పే. ఆ పార్టీకి పంజాబ్‍లో దక్కిన నిక్కమైన గెలుపుకు అసలు కారణం కాప్టన్ అమరీందర్ సింగ్. ఇంకెవ్వరూ కారు. అకాలీదళ్-భాజపాలు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. చైనా గాంధీ కుటుంబంలానే బాదల్ కుటుంబం కూడా అసమర్థుల కూటమి. లంచగొండితనం, అప్రయోజకత్వం అణువణువునా తొణికలాడే నిరుపయోగులు ఆ కుటుంబ సభ్యులు. ఈ విషయాల్లో కాంగ్రెస్ కుటుంబానికి ఏమాత్రం తీసిపోనివారు వారు. ఇటువంటి ప్రాంతీయ పార్టీకి సహాయకులుగా ఉండాల్సిన కర్మ భాజపాకు లేదని క్రితంలో అనేకమార్లు చెప్పాను. బహుశా వచ్చే ఎన్నికల్లో భాజపా మహారాష్ట్ర నమూనానే అనుసరించవచ్చు. ఒంటరిగానే పంజాబ్‍లో పోరాడవచ్చు. ’నీ భాగస్వామి పాపాలకు నువ్వు బలికావడం కంటే నీ స్వంత తప్పిదాల వల్ల ఓడిపోవడమే ఎంతో మేలు.”
ప్రస్తుతం దేశంలోని రాజకీయ వాతావరణంలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులను వెనక్కి మళ్ళించడం ఏమాత్రం సాధ్యం కాదు. కాంగ్రెస్, ఎస్.పి, బి.ఎస్.పి వంటి పార్టీలు అమలు పరచిన ’జమిందారీ’ రాజకీయాలు ఇక ఏమాత్రం నడవ్వు. ముస్లింలను బుజ్జగించడం, కులాల మధ్య చీలికలు సృష్టించడం వంటివి ఏ రాష్ట్రంలోనూ సాధ్యపడకపోవచ్చు. అనేక రాష్ట్రాల్లో ప్రజలు రాజకీయ మూర్ఖులను, అబద్ధాలకోరులను చూడాల్సిన దానికంటే ఎక్కువ గానే చూసేసారు. ఇలాంటి దగాకోర్లను వంత పాడే మీడియా దగుల్బాజీలు ఏడ్చే ఏడ్పులు బీదాబిక్కి కోసం ఏమాత్రం కాదు. సిక్యులర్ పార్టీల పాలనలో తమకు దక్కిన రాచ భోగాలు ఇప్పుడు మాయమైపోయినందుకే వారి ఏడ్పులు. వ్యంగ్య రచయిత అయిన P.J. O’Rourke చెప్పిన ఈ మాటల్ని ఓ మిత్రుడు నాతో పంచుకున్నాడు:
పై మాటలతో నేను ఏకీభవిస్తాను. అన్నిరకాలుగా భ్రష్టుపట్టిన ఉన్నతవర్గీయులే ఈ సిక్యులర్స్. వారు అనుభవించిన అక్రమ ఐశ్వర్యాలను మోడి ఊడ్చిపారేసాడు. వారు అభిమానించిన చైనా గాంధీల్ని కలికాని కూడా లేకుండా చేసాడు. వీరినే కాదు, సిక్యులర్స్ తమ రెండవ ఎంపికగా అనుకున్న SP, AAPలను కూడా నిర్వీర్యం చేసాడు మోడి. ఇటువంటి మోడిని కూల్చడానికి వీళ్ళు ఎన్నో కుట్రల్ని చేసారు. దాద్రి, ’పెరిగిపోతున్న అసహనం’, కన్హయ్యాలాల్ నుండి నిన్న మొన్నటి గుర్‍మెహర్ వరకూ రకరకాల కుతంత్రాల్ని వీరు పన్నారు. డీమనిటైజేషన్‍ను ఏ పెద్ద భూతంగా చిత్రీకరించారు. నగదు రద్దు అనేది “ఎమర్జెన్సీ” అని కేకలు పెట్టారు. పేదలకు గొడ్డలిపెట్టని వారు ఊదరబెట్టిన డీమనిటైజేషన్ ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపకపోవడంతో చతికిలపడ్డారు.
ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా జరిపిన విజయోత్సవ సభలో మోడి ఓ హెచ్చరను జారీ చేసాడు. సదరు “పొలిటికల్ పండితులు” చూసుకుని మాట్లాడాలని, నోటికి వచ్చినట్టు వాగడం వద్దని ఆ హెచ్చరికలోని సారాంశం. నా వరకూ ఈ “పొలిటికల్ పండితులు” పండితులు కారు కేవలం “పొలిటికల్ పీడితులు.”
ఈ “ప్రాబ్లమ్ చైల్డ్”లోని పిల్లాడిలా దుష్టుల పిడికిలి నుండి బయటపడ్డానికి ప్రయత్నించేవారే సాధారణ ఓటర్లు. పేదరికం నుండి బయటపడి గౌరవ మర్యాదలతో కూడిన జీవితాన్ని గడపాలని ఆశించేవారే సాధారణ ఓటర్లు. జీవితాలకు ఓ అర్థాన్ని, ఆర్థిక భద్రతను కోరుకునేవారే సాధారణ ఓటర్లు. ఈ క్రింది వీడియోలో కనబడే అనాథ శరణాలయం మేనేజర్ గురించి ఓ పిల్లవాడు ఏం చెప్పాడో, అవే మాటలు మన ఓటర్లు సిక్యులర్ మీడియా మూర్ఖుల పట్ల చెప్పారు:
మీడియాలోని సిక్యులర్ బుద్ధిహీనులు తాము శ్రద్ధగల శ్రోతలం కాము అని తేల్చిచెప్పేసారు. వారు తెలివైనవారు కానే కారు. మోడిపై దుమ్మెత్తి పోసే కొద్దీ, “మోడికి పరీక్ష – మోడీకి పరీక్ష” అంటూ అయిన దానికి కానిదానికి నోరు పారేసుకునే కొద్దీ వీరు తమ సమాధిని తామే లోతుగా తోడుకొంటున్నారు. దీన్నే నేను “సిక్యులర్ స్మశానం” అని పిలుస్తాను.
ప్రజలు ఇక ఏమాత్రం ’ఇసుక’ను తాగబోరు. కరపత్రాలను, ముష్టి భిక్షను ప్రజలు కోరుకోవడం లేదు. బదులుగా వారు సక్రమంగా పనిచేసే విధానాన్ని, అలా చేస్తున్నట్టుగా చెప్పే ఋజువులను డిమాండ్ చేస్తున్నారు. ఈ కోణంలో, కేంద్రంలో మోడి, రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలు ఎంతో కొంత సక్రమ పాలనను, దాని ఋజువులను ప్రజలకు అందివ్వగలుతున్నాయి. ఎన్నికలకు వెళ్ళబోతున్న ఇతర రాష్ట్రాలపై యు.పి ఫలితాలు తీవ్ర ప్రభావాన్ని చూపబోతాయన్న మాటల్ని కొట్టిపారేసేందుకు అవకాశం లేదు. ఈ అంశాన్ని గుర్తించడానికి ఇష్టపడనివారు ’సిక్యులర్ స్మశానం’లో తమ సమాధిని వెతుక్కున్నవారే అవుతారు.
@@@@@