ఉడుపి శ్రీకృష్ణ ఆలయం – చరిత్ర – ఇతర విశేషాలు

ఉడుపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణిదేవి నిర్మింపజేసిందనే పురాణ ఐతిహ్యం ఉంది. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్రగర్భంలో చేరింది. ఆ తర్వాత ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది.