సైన్స్ సహాయంతో అన్నింటినీ తెలుసుకోగలనన్న ధీమా మానవుడికి ఉంది. ఇది ఏమాత్రం ఆక్షేపణీయం కాదు. చైతన్యశీలమైన సృజనాత్మకతను నిరంతరం కలిగివుండడం మానవులకు మాత్రమే సాధ్యం. కనుక సైన్సే మార్గం, సైన్సే దారిదీపం అని అనుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు. కానీ ఆ రభసలో పాతవన్నీ పుక్కిటివేనని కొట్టిపారేయడం, "మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్" అని ప్రాచీనుల్ని నిరసించడం తగదు.పై కీర్తనలో కనకదాసు అదే చెబుతున్నాడని అనిపించింది. ఎందుకంటే.....ఇందుకు!