ఒక్క అడుగు ముందుకేస్తే నీకు తెలుసు నువ్వెక్కడుంటావో! జీవితమంతా నడిచి నడిచి అలసిసొలసిన నీకు ఆ ఒక్క అడుగు వెయ్యటానికి అరక్షణం అయినా పట్టలేదు! ప్రయాణం విసుగనిపించిందో అనుకున్న లక్ష్యం అందకుండా పోయిందో ఇంటా బయటా నిన్నుమించిన అసమర్థుడు, నిరాశావాది వేరెవరూ…
Tag: కవితలు
ఈ ఎడారిలోనూ ….
ఈ ఎడారిలోనూ …. నిండుపున్నమి వెన్నెలఈ ఎండమావి ఎదలో మంచుపొరకు అంచులా గడిచిపోయి బ్రతికొచ్చే గతకాలపు సౌఖ్యంలా జలతారుల చిరు కదలికలో మెరుపు పూల మాలికలా ఏకాంతపు రాత్రికి జలపాతం అలికిడిలా చల్లగాలి వీవెనలా మల్లెపూల గమకంలా ఈ ఎడారిలోనూ…
రహదారి పై…
రోడ్డు చెప్పే కథలు వినడానికిబారులు తీరాయి చెట్లుదూరమెక్కువైందనితలకో ట్రాన్స్ మీటర్బిగించుకుంది కొండ ******* చక్రాలుముద్దులు పెడుతుంటేమెలికలు తిరిగిపోతోంది రోడ్డు ******* మనసు తర్కిస్తోంది…నలుచదరంగా ఉన్నాననిభూమి మోసం చేస్తోందాని?అది ప్రేమ కాకూడదా ?అంది రోడ్డు *******
ఈ ఉదయం
బరువుగా బిగిసినతలుపుల వెనక, చీకట్లో..రంగుల ప్రపంచంఓ లోయ సరిహద్దుల్లో అంతమయిందిరెండు సూర్యుళ్ళ ఉదయంతోసగం కాలిన రాత్రిముళ్ళ కంప మీదఅలానే కరిగిపోయింది.చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచిజారిపోతున్న చీకట్లకుతనువు చాలించిన తుంపర్లుతెరలవుతున్నా..చల్లగా వీచిన తెల్ల పదాల తావిపూల తోటలోకి ..దారి చూపింది.
ఊరట
నీకు, నాకు మాత్రమే అర్థమయ్యేభాషలో మాట్లాడుకోవడంనీకు, నాకు మాత్రమేఅర్థమయ్యే సంబరంనిన్నటి అస్తమయం తర్వాతఏ చెట్టులో ఏ కొత్త పువ్వుపూసిందోనని వెదుక్కునే సూరీడల్లేనీ కొత్త కొత్త మాటల్లోనిగారడీలను వెదుక్కొంటానుమెత్తని నీ చేతుల్లోనా భవిష్యత్తు ఒదిగివుందనిఅనుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది !కనిపించే ప్రతి ముఖంలోనూ నీవే!వ్యక్తి…
అంతర్యానం
అరమరికలు లేవనుకున్న ఆకాశానికే అడ్డుతెరల్లా ప్రశ్నల చినుకులు పర్వతంలా పరుచుకున్న విషాదపు నిషాలో ఆశ్రునిక్షిప్తమైన ఆకాశం నిండా అపశబ్దాలే. అర్ధంకాని అలజడి మధ్య ఆకాశం నిద్రపోతున్నదంటే నమ్మలేం! ఆగుతూ, సాగుతూ, పారుతున్న ప్రవాహంలో ఎవరి ఆత్మకథో రాలిపోయిన పూల నవ్వులా…
గుడిగంట మీద సీతాకోకచిలుక..
జపనీ కవితా ప్రక్రియ హైకూ గురించి ఒక పరిచియ వ్యాసం కళ్ళు మూసుకుని ఒక దృశ్యాన్ని ఊహించండి. అది సంధ్యా సమయం. సుఖ దుఃఖాలకూ, రాత్రీ పగళ్ళకూ అందని దివ్య సంధ్య. మీరు కొండ మీద పాత దేవాలయంలో ఏకాంతంగా ఉన్నారు.…
మూతబడ్డ జీవితాలు
చచ్చినోళ్ళు ఫ్రేముల్లో బతికినట్లు నేను ఈ గోడల మధ్యన అతుక్కునుంటా బేల పెళ్ళాం చెంపల మీద బేవార్సు మొగుడి దెబ్బలా కడుపు మీద ఆకలి మడతలు పచ్చని చెట్ల మధ్యన ఇనుపస్థంబంలా వెర్రిగా రోడ్డులో దిగబడిపోతాను లైటు హౌసు దీపంలా ఉండాల్సిన…
పోయినోళ్ళు
వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే! చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!
జ్ఞాపకాల గుబాళింపు
నిద్ర జార్చుకున్న నింగి మధ్య విరగ పూసిన కలువ ఆపై వేచిన తుమ్మెద పలకరింపు.. కంటి కొలకులు చూసిన ముత్యాల పలవరింపు.. అలసిన అలజళ్ళను అలవోకగా ఏరుకుంటూ.. వడిలిన తెరల వెనకగా ఎగబ్రాకిన వేకువ కిరణం.. వెచ్చగా ఒళ్ళు విరుచుకున్న…