నమ్మకము, ధైర్య సాహసాలకు మారు పేర్లుగా నిలిచిన – “గూర్ఖాలు” మనకు సుపరిచితమైన పేరే! నిత్యమూ రాత్రుళ్ళు, లాఠీలతో చప్పుడు చేస్తూ, కారుచీకటి వేళలలో ప్రజలకు మెలకువ తెప్పిస్తూ “పారా హుషార్!” చేస్తూ,చోరభయాలనుండి కాపాడే విధిని స్వచ్ఛందముగా తమ భుజస్కంధాలపైన నిడుకొన్నవారు…