చేవ్రాళ్ళు, వేలిముద్రలు – ఇవే లేకపోతే?

పత్రాల పైన, ధన సంబంధ కార్యాలు, పెళ్ళిళ్ళూ, పబ్బాలూ, వీలునామాలు; అంతెందుకు, ఓటు హక్కు వినియోగము చేసుకోవాలన్నా కూడా ఏది అవసరమౌతుంది? ప్రోనోటు వ్యవహారాదులకూ, గుర్తింపు & రేషన్ కార్డుల పైనా ఉంచాల్సినది ఏమిటి? ఉలిక్కిపడకుండా చెప్పేయగలరు కదా!   జవాబు: “చేవ్రాలు”. అదేనండీ. సంతకము! దీనికి జతగా తటాలున మనకు స్ఫురించేది “వ్రేలి ముద్రలు”. …