నా చిన్నప్పుడు అర్ధణా, అణా, బేడ అనే నాణ్యాలు ఉండేవి. పైస, దమ్మిడీ, కాణీలు ఒక పైస విలువ గల తొలి ద్రవ్యం. మధ్యలో చిల్లువుండే కాణీలను పిల్లలు చూపుడు వేళ్ళకు తగిలించుకుని, వెళ్ళి చిరుతిళ్ళు కొనుక్కునేవారు. ఈ కాణీలు రాగి లోహంతో తయారు ఔతూండేవి. అప్పట్లో ఒక కాణీకి…