గొప్పోణ్ణవటానికి దగ్గిర దారేది గురూ?

కేవలం కొన్ని మొహిరీల అదనపు సంపాదన కోసం అనామకుడైన ఆ లంచగొండి సైనికుడు  చేసిన పని భారతదేశ చరిత్రని యెంత వూహించని మలుపు తిప్పిందో చూశారుగా! ఇవ్వాళ రక్షణ శాఖ లోని వున్నతాధికారులే అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంటే దేశ భవితవ్యం గురించి నిర్భయంగా వుండగలమా? దారా షికో ఆస్థానంలో కవిగా తెలుగువాడైన పండిత జగన్నాథ రాయలు వుండేవాడు. దారా షికో పతనం తర్వాత ఢిల్లీ వొదిలి దేశాటనలో కాలం గడిపాడు. కథలు, కావ్యాలు రాయలేదు గానీ ఇతని వ్యంగ్యవైభవం అసామాన్యం! అతనిలా అంటాడు - "ఓ గాడిదా! రోజంతా బట్టల మూటలు మోసి వీపు విరగ్గొట్టుకుని ఈ గుగ్గిళ్ళు తినడం దేనికి? రాజుగారి అశ్వశాలలో హాయిగా విందు భోజనమే చెయ్యవచ్చు గదా! కాపలావాళ్ళు గుర్తు పట్టి తంతారు గదా అంటావా, అక్కడ నూటికి తొంభయ్ శాతం మంది గుర్రానికీ గాడిదకీ తేడా తెలియని వాళ్ళే వుంటారు. మిగిలిన ఆ పదిమంది మాటా రాజుగారి దగ్గిర చెల్లదు" అని.