ఇవాళైనా ఏమైనా చెప్తావని ప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చి నిల్చుంటాను మలుపులు తిరుగుతూ ఏ మార్మికతల్లోకో మౌనంగా వెళ్ళిపోతావు కదిలే ప్రవాహంలో కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా “నేను” మిగిలిపోతాను!
Tag: మూలా సుబ్రహ్మణ్యం కవితలు
చిట్టి కవితలు
1. ఇప్పటిదాకా నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయి నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకుంటాను నీ కేరింతల్లో నా కేరింతలు కూడా కలిసిపోతాయి 2. పాకడమైనా రాని నువ్వు ఎక్కడెక్కడి లోకాలకో తీసుకుపోతుంటే ఆనందంగా నీ వెనక నేను! 3. నీ…
అద్దం
మా చంటాడి కంటి పాపలో నా ప్రతిబింబం నన్ను నేను తొలిసారి చూసుకుంటున్న అనుభూతి! ****
దివ్వెలు
1. భూమ్మీద ప్రతి చెరువులోనూ మునుగుతాడు చంద్రుడు 2. గాలి కచేరీ చెట్టు నుండి చెట్టుకి ఆకుల చప్పట్లు 3. వెలుగు నీడ శబ్దం నిశ్శబ్దం జీవం మృత్యువు అలవోకగా కలసిపోయి అడవి 4. మూసుకుని తెరుచుకోవడంలోనే జీవమైనా రాగమైనా…
ఈ రాత్రినిలా…
బయట సన్నగా వర్షం కురుస్తోంది బాల్కనీలో చలిగాలి బలంగా తాకుతోంది. వీధి దీపాల కాంతిలో వాన చినుకులు మెరుస్తున్నాయి. వస్తానన్నవాడు రాలేదు కనీసం ఫోనైనా చెయ్యలేదు. అసలు ఎవరైనా ఎప్పటికైనా ఈ గదిలోకి వస్తారా? ఎవరొస్తేనేం? రాకపోతేనేం? వాన చినుకుల…