నీలో కొన్ని కదలికలు నీలో ఒక పాపాయి రూపుదిద్దుకుంటోంది నాలోనూ కొన్ని కదలికలు నాలో ఒక పద్యం రూపుదిద్దుకుంటోంది అంతా ఒకే కవిత్వం నీలో చిట్టితల్లిగా నాలో అక్షరాలుగా!
Tag: మూలా సుబ్రహ్మణ్యం రచనలు
ఈ కాసిన్ని అక్షరాలు..
1. శృంగేరిలో సూర్యాస్తమయం తుంగనది అనంతంలోకి.. ఓంకారం మౌనంలోకీ.. నదిలో చేపలు.. మదిలోనో? దేన్నీ పట్టుకోలేను చంటాడితో పాటు నాకూ కొన్ని కొత్త అక్షరాలు!? గుడిలో అమ్మ నవ్వుతుంది. 2. పాటే అక్కరలేదు ఒక్కోమాటు చిన్న మాటైనా చాలు జ్ఞాపకాల…
శూన్యంలో పూలు
పొగ త్రాగరాదులో “దు” చెరిపి వేసే చిలిపి బాల్యాలు, నాలాగేసినాడు దొంగ అని పంటలేసుకోడాలు, నావల్ల కాదు మొర్రో అని స్కెచ్చు పెన్ను మొత్తుకుంటే వెనక కుచ్చు తీసి దాన్లో నీళ్ళు పోసి ఇంకా రంగులు రాబట్టే ప్రయత్నాలు, కరెంటు పోయిన…
నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే…
నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే గుప్పెడు క్షణాల్ని దోసిట్లో పోసి ఇక నీ ఇష్టం అని ఆమె చినుకుల్లో చినుకుగా మాయమైంది..ఈ క్షణాలు కరిగిపోయేలోగా అతడిని కలుసుకోవాలి… చుట్టూ కురుస్తున్న వర్షం…. కొండకోనల్లో వర్షం.. గుండె లోయల్లో వర్షం.. లోకంలోని కల్మషాన్నంతటినీ కడిగేస్తూ…
ఇస్మాయిల్‌కి మరోసారి…
ఆకాశపు నీలిమలో మునకలేసి కిలకిలల పాటల్లో తేటపడి మౌనంగా గూట్లోకి ముడుచుకుంటూ పక్షి రెక్కల్లో మీ అక్షరాలు ఒడ్డున సేదదీరిన మనసుల్ని చల్లగా స్పృశిస్తూ పున్నమి రాత్రి పూర్ణ బింబం కోసం ఎగసిపడుతూ ఏ లోతుల్లోంచి.. ఏ తీరాలకో..…