అనుగురాజు తర్వాత పల్నాటి ప్రభువైన నలగామరాజు కూతురు పేరిందేవి. నలగామరాజుకు పేరిందేవి ఏకైక సంతానం. పల్నాటికంతా అందమైన పిల్ల. నాయనమ్మ మైలమాదేవి దగ్గర ఆ పిల్లకు గారాబమైతే, చిన్నాన్న నరసింగరాజు పేరిందేవిని కంటికి రెప్పల్లే చూసుకుంటాడు. (నలగామరాజూ భార్య మరణించి…