విగ్రహాలేగా అని విరగ్గొట్టారు హద్దులేగా అని విడగొట్టారు దమ్ముల్లో చెమ్మే ఉంటే బొమ్మల్లో అమ్మల్ని చూసుకోవచ్చు సరే…ఫోండి…విరగ్గొట్టో విడగొట్టో మురిసిపోండీ….మురిగిపోండి! నా నరం తెగితే నొప్పి నీకు తెలియదు నీ నరం తెగితే…… నరం తెగ్గోసే వరం కోరుకొన్నావ్…
Tag: Sagatu Jeevi articles
అపద్దపు మాటలు!
భూమికి చంద్రుడికి మధ్యరాకాసి గబ్బిలంలారెక్కలు చాచిన మేఘంచీకటి విషాన్ని చిమ్ముతోంది తన గుడ్లనే మింగేసి ముడుచుకొన్న పాములాగున్న నది వొడ్డున నీడొకటి ఏడుస్తోంది. గద్దకి బిడ్డని బలిచ్చేసిన పిట్ట ఏడుపుకి గొంతు కలుపుతోంది చెట్టు అబ్బా… ఎంత…
నేను మాత్రం….నీ ప్రకృతి
సున్నం కొట్టుకొన్న గోడకు రెండు కంతల కన్నుల్లో రెండు సూర్యగోళాల వెలుగురేకుల్లో ఎగిరి ఎగిరి పోతున్న ధూళి కణాల వేటలో కోట్లాది బాక్టీరియాల వకేవక్క మనసులో పుట్టి పెరిగి పండి రాలిపోయే ఊహల్లో మొట్టమొదటి ఆదిమ ఆలోచన వెనక లుంగలు చుట్టుకొన్న…
క్షణం
మత్తెక్కిన కలల్తో మెరుస్తున్న చీకట్లోరమిస్తున్న నీడలు కోరికల అగ్నిచుంబనం చెమట నదుల్లో ఈదడం…ఆహ్…జిస్ జిస్…. ఆకాశపు లోతుల్లో పేలే మెరుపులకిజలదరిస్తున్న పుడమి వొళ్ళు బహువచనాలన్నింటినీ ఏకం చేసేతుఫాను జీవితంకొన్ని క్షణాలే!
నాలోపటి సూరీడు
విసిరికొట్టిన మెతుకల్లేఆకాసంలో అంటుకొన్నాడు చందమామఆకలేసిన బిచ్చగాడికి ఇంతకంటే కవిత్వం రాదు గ్లాసంచున దుమకబోతున్నఐసు చుక్కలా చందమామనషా కాషాయ తాషామర్ఫాలోజోగుతోన్న జోగి, జోగినీమణికిఅంతకంటే పైత్యమెక్కవే! చీదగా మిగిలిపోయినచీమిడి చుక్కలా చందమామమొగుడు చాటు పెళ్ళాంకుఅప్పుడు, ఇప్పుడూ వొకే చంద్రడు చిట్లిపోయిన చుక్కల్ని చూసిచంద్రుడు బావురుమంటుంటేమంటల…
వొద్దులే
కంట్లో నీళ్ళ చుక్కల్తో నిన్ను చూస్తేపగిలిపోయిన ఆకాసం నుండిజాబిల్లి రాలిపడినట్టనిపిస్తాది బతుకు అపస్వరం పలికినాకఅవసరం యెవరిదైతేనేంలే! యెవడో వాడుమొగవాడంతేనువ్వో జూకామల్లెవి అంతా ముగిసినాకవాడు..ఎవడైతేనేంలేఊళ్ళో మరో గదిలో మరో జూకామల్లెకోసం పోతాడునువ్వు మాత్రంఅదే గదిలో మరోసారివికసించడానికి పనికిమాలిన ప్రయత్నం చేస్తాంటావు నీ కంట్లో…
పిచ్చిలో….
నేనో పిచ్చిమొక్కనిరోడ్డు పక్కో, సగం కూలిన గోడ సందులోనో పుట్టుకొస్తా నాలాంటిదే పిచ్చిగాలికొంచెం జోరుగా, కొంచెం తూలినట్లుగా వీస్తాదినేనూ ఊగుతా నా ఒంటరితనం మాయమైపోవడం ఇష్టంలేనిచెయ్యొక్కటి నా గొంతును నులుముతుంది గాలి పిచ్చితోటి నా తలఆ చేతిలో ఊగుతానే ఉంటది
వెకిలి జీవితం
గుండుసూదికి గుచ్చిన సీతాకోకచిలుకతెరుచుకొన్న నోటిలో గడ్డకట్టిన బాధనువిరజిమ్ముతోన్న నెత్తుటి బొట్టులోఒక జీవితమంత నిర్లక్ష్యంతోగద్ద గోళ్ళనుఅద్ది, రాసిన రాతలకుఅర్థాలు వెదుక్కొంటున్నావా? కలుగులో దాక్కొన్న ఎలుకనుకనిపెట్టి చంపే విషగుళికలోనా నగర తత్వం రూపం,బానిసత్వం నీడల్ని పరిచిఅడ్డుగోడల గుడ్డికళ్ళకుకాటుక పెట్టుకొంటున్నావా? కరువుతో గుండాగిపోతున్నచేపపిల్ల మెదడులోని చచ్చుకణాలదుర్భర…
గమ్యం వైపుకు
వీధిలో నడుస్తున్నాను…కానీ సమాధి స్థితిలో ఉన్నానువిసుగొచ్చేసిందీ లోకమ్ పై! అసలేముందని ఇక్కడ?ధూళికలుషితమైన గాలిపొగఅంతులేని రొదబజారుల్లో లుకలుకలాడుతున్న జనంకాళ్ళ కింద రోడ్డు వేడెక్కిన పెనంచిరాకుపరాకుకరుకు మొహాల మొహర్లుపరుగెత్తడమే పరమావధిపరుగు…పరుగు…పరుగువిలువలనుండి, వలువలనుండితత్వం నుండి, సున్నితత్వంనుండి మనుషులుగా బతకడానికి కావల్సిన అన్నింటినుండీపరుగో…పరుగుమనదికాని, మనసునుండి రానిస్ప్రేలు, డీయొడరెంట్లుహాయ్…
అపురూపం
మబ్బువెండి రంగుల పాటల్నేవో చల్లుతో పోతోంది కోకిలవొంటరి పాటని వొకే స్వరంలో పాడుతోంది పువ్వువుత్తరపు గాలిలో కదులుతోంది సాలీడునిశ్శబ్దపు గూడు కట్టుతోంది ఆకాశందాచిపెట్టిన లంకెబిందె మెరుస్తోంది ఈ యింద్రధనుస్సునిభద్రంగా దాచుకొని కాపాడుకోవాలి