వొద్దులే

కంట్లో నీళ్ళ చుక్కల్తో నిన్ను చూస్తేపగిలిపోయిన ఆకాసం నుండిజాబిల్లి రాలిపడినట్టనిపిస్తాది బతుకు అపస్వరం పలికినాకఅవసరం యెవరిదైతేనేంలే! యెవడో వాడుమొగవాడంతేనువ్వో జూకామల్లెవి అంతా ముగిసినాకవాడు..ఎవడైతేనేంలేఊళ్ళో మరో గదిలో మరో జూకామల్లెకోసం పోతాడునువ్వు మాత్రంఅదే గదిలో మరోసారివికసించడానికి పనికిమాలిన ప్రయత్నం చేస్తాంటావు నీ కంట్లో…

వెకిలి జీవితం

గుండుసూదికి గుచ్చిన సీతాకోకచిలుకతెరుచుకొన్న నోటిలో గడ్డకట్టిన బాధనువిరజిమ్ముతోన్న నెత్తుటి బొట్టులోఒక జీవితమంత నిర్లక్ష్యంతోగద్ద గోళ్ళనుఅద్ది, రాసిన రాతలకుఅర్థాలు వెదుక్కొంటున్నావా? కలుగులో దాక్కొన్న ఎలుకనుకనిపెట్టి చంపే విషగుళికలోనా నగర తత్వం రూపం,బానిసత్వం నీడల్ని పరిచిఅడ్డుగోడల గుడ్డికళ్ళకుకాటుక పెట్టుకొంటున్నావా? కరువుతో గుండాగిపోతున్నచేపపిల్ల మెదడులోని చచ్చుకణాలదుర్భర…

తాతగొరి అమ్మ

మొన్నోదినాన మంచంమీద పండుకోని సుట్ట కాలుత్తా వుండా. మా ఇంటిది బైట కట్టమీన కూకోని బియ్యం సెరగ్తాండాది. వో పోరగాడొచ్చి “ఆంటీ! మీ తాత వుండాడా?” అని జోరుగా అరిసిండు. “మా తాత యెవడ్రా” అని ఇంటిది గట్టిగా అర్సింది. “గదే…

సూర్యుడు నా ఆదర్శం

పెగ్గుల్ని పరామర్శించికొద్దిగా నిద్దరోతానామళ్ళీ వచ్చేస్తాడు చీకటి తవ్వి పాతరేసినామబ్బులు ఉతికి ఆరేసినానిబ్బరంగా ఉంటాడుఅంబరాన సూర్యుడు నదికి, సముద్రానికిఒకేసారి కన్నుకొడతాడుఆకతాయి సూర్యుడు దిశమొలతో నిలబడేదిక్కుల్ని వెలిగిస్తాడుసిగ్గులేని సూర్యుడు సూర్యుడు నా ఆదర్శం వెలిసిపోయిన నా జీవితాన్నివిప్పేస్తున్నానువెలుగుల్ని విరజిమ్మడానికి సంఘమాకళ్ళు తెరిచే ఉంచు!

గమ్యం వైపుకు

వీధిలో నడుస్తున్నాను…కానీ సమాధి స్థితిలో ఉన్నానువిసుగొచ్చేసిందీ లోకమ్ పై! అసలేముందని ఇక్కడ?ధూళికలుషితమైన గాలిపొగఅంతులేని రొదబజారుల్లో లుకలుకలాడుతున్న జనంకాళ్ళ కింద రోడ్డు వేడెక్కిన పెనంచిరాకుపరాకుకరుకు మొహాల మొహర్లుపరుగెత్తడమే పరమావధిపరుగు…పరుగు…పరుగువిలువలనుండి, వలువలనుండితత్వం నుండి, సున్నితత్వంనుండి మనుషులుగా బతకడానికి కావల్సిన అన్నింటినుండీపరుగో…పరుగుమనదికాని, మనసునుండి రానిస్ప్రేలు, డీయొడరెంట్లుహాయ్…

నిష్ఫల జీవితం

నీళ్ళు నిండిన గుంతలాలోతెరుగని మనసుతోయెన్నాళ్ళిల్లా బతికేది? చెప్పాపెట్టకుండా కురిసే వాననుగుప్పిట్లో బంధించాలనే వో జీవితకాలపు వాంఛనిరెప్పలకి అంటించి తిరిగినాఫలించని ఆశ. ఎన్నిసార్లు దాటినా అదే మైలురాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటుంది ఉసూరుమనే ప్రాణాలు ఆ పక్కనే వున్న చెరువులో బుడగల్లా…

జీవితంలో…

రేడియో సరిగ్గా పాడడంలేదు…మనిద్దరి మధ్యా గులాబి రంగు మాటలు దొర్లి చాన్నాళ్ళైంది. నువ్వు దేవుణ్ణి అతిగా నమ్ముతావు.కనబడకనే కొట్టుకొనే గుండెలా..నేను టీకప్పులో బుడగల్ని లెక్కపెట్టుకొంటానుచాక్లెట్ రేపర్ విప్పుతోన్నప్పటి పిల్లవాని మనసులా.. కొన్నిసార్లు అన్నీ బాగున్నట్టే వుంటుందిటీవీలో నచ్చిన ప్రోగ్రామ్, మొబైల్లో లేటెస్ట్…