నువ్వింకా గుర్తున్నావు!

ముల్లు గుచ్చుకున్నట్టు కళ్ళల్లో నీ కల జారిపోయిన మాటలా వెనక్కురాని ఆ క్షణం   చుట్టూ ఎన్నో ఉన్నాయి ఐనా, ఒక్కసారైనా నీ మోము చూడాలనిపిస్తుంది బహుశా, నా ప్రాణాలు నీ కళ్ళలో దాగున్నాయేమో!   కాలం నీపై చేసే ఇంద్రజాలాన్ని…

పోయినోళ్ళు

వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే!   చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!

జలపాతం

ఆ జలపాతం ముందు దోసిలి పట్టుకుని ఎంతసేపుగా నిలబడ్డాను? నిండినట్టే నిండితిరిగి తన అస్తిత్వంలోకేఆవిరైపోతూ…కవ్విస్తూ… తడిసిన మనసు సాక్షిగాఅందీ అందని సంతకం కోసంతెల్ల కాగితం విరహించిపోతోంది అలుపెరుగని నృత్యానికి కూడాచలించని ఈ బండరాళ్ళలోకనీ కనిపించని చిరునవ్వేదోదోబూచులాడుతూ…చిక్కుముడి విప్పుతూ. మనిషి కందని రాగంతోసాగిపోతున్న…

మంచు

చలికాలపు సాయంత్రంఎవ్వరూ లేని బాట మీదఏకాకి నడక. రాలిన ఆకుల కిందఎవరివో గొంతులు ఎక్కడో దూరంగానిశ్శబ్దపు లోతుల్లోకిపక్షి పాట లోయంతా సూర్యుడుబంగారు కిరణాలు పరుస్తున్నాకాసేపటికి ఆవరించే చీకటి మీదకేపదే పదే మనసుపోతోంది కర్రపుల్లల కొసన నర్తించేఎర్రని చలిమంటలోకిప్రవేశించాలనిపిస్తోంది. కురిసే మంచునా గొంతులోఘనీభవిస్తోంది.…