1 పచ్చి సువాసనలు కమ్ముతుంటే పచ్చని పొలాల్లో పలురకాల పక్షుల్ని లెక్కిస్తో చాలా దూరం పయనించాక ఓహ్! దారి తప్పాను కాబోలు అనిపిస్తోంది ! 2 ఏ నమ్మకాలూ లేవనీ నువ్వేమో సునాయాసంగా వొదిలించుకుంటావు – పక్కలో పాముని దాచుకొని నిద్రిస్తున్నట్లు…
Tag: Telugu poetry
బహురూపియా
1 లేవగానే ముద్దుగా మొహాన్ని అద్దంలో చూసుకొంటాను – లేత శిశువంత సుకుమారత్వాన్ని తడుముకుంటాను , నా తండ్రి లోని గంభీరత్వాన్నీ కొడుకులోని చిలిపితనాన్ని కలగలసిన హృదయోల్లాస పొగరుబోతు క్షణమిది – నన్ను నేను చూసుకోంటాను మురిపెంగా –…
సొంత ఇంటి పరాయి
చాల రోజుల క్రితం నా ఇంటి పెరట్లోని చెట్టు కొమ్మమీద పక్షి గూడు అల్లింది – రోజు పాటల్లా కూసేది – కొంత కాలం లోక సంచారం చేసొచ్చాక గూడులేదు పక్షి లేదు చెట్టూలేదు ఆకస్మికంగా నా దేహం నీంచి…
సాహిత్యంలో సహృదయత
ఈశావాస్యోపనిషత్తులో ఆత్మ గురించిన వివరణలో వో చోట “కవి” గురించిన వివరణ వుంది. కవిర్మనీషీ పరిభూ: స్వయంభూ: యాథాతథ్యత: అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య: సమాభ్య: ఆ ఆత్మకవి – సర్వవ్యాపి, క్రాంతదర్శి, ఋషి ఐవుంటాడు. అంతేకాదు అతను విశ్వప్రేమి,…
మౌని
ఆకారంలేని మాటల్లో సాకారంగా కనబడతాయి ఊహలు ఆశలు భయాలు బహువిధ బాధాతప్త విదళిత హృదయాల నిర్వాణ పర్వాల్లా మాటలు…మాటలు…మాటలు కండరాల మధ్య రాపిడే నిండు జీవితాల్ని శాసిస్తోందని తెలుసుకున్న నేడు మాటలకు విలువనివ్వలేక పోతున్నాను ! *****
ఇంతే!
ముఖ కవళికల్ని తెరచాటున దాచవచ్చు కన్నీటిలో కూడా కరగని భావాలుంటాయా? నిప్పులో మండని పదార్థాలుండొచ్చు నిజాల్ని ఒప్పుకోని మనసులుంటాయా? మేఘాల స్పర్శను పొందుతున్నా వర్షించడం మర్చిపోయిన ఆకాశానికి మిగిలేది గతించిన జ్ఞాపకాలు మాత్రమే!
కష్టార్జితపు మత్తు
కష్టార్జితపు మత్తు ఆమె పిల్లల ఆకలి మంటల్లో ఆతని కష్టార్జితపు మత్తు చమురు పోస్తుంది. ****** మౌనపు విత్తులు నీ పెదవులపై ఫలించిన మౌనాన్ని విత్తులుగా చల్లుతూ, నా మనసున ఓ ఉద్యానాన్ని పూయిస్తున్నాయి నీ చూపులు. ******** అనుభూతులు…
వీడ్కోలు
మౌనాలు కమ్ముకొస్తున్నాయి ఇక సెలవంటూ అనుభవాలు జ్ఞాపకాలుగా పరిణమిస్తున్నాయి కాలపు కథ సరే! మామూలే నేస్తం దూరం చేయడానికే దగ్గర చేస్తుందేమో ఇక ఇపుడు మనసుపై మరపు పొరలు కప్పాల్సిందే ఎన్నో గలగలలు కిలకిలలు మరపు రాని జ్ఞాపకాల దొంతరలనిక…
వెలుతురు
మళ్ళీనేను మొలుచుకొస్తానునా చావులోనుంచే… వొంటి గుడిసెలో దీపం పెడతానుపారిపోయిన పిట్టల్ని పట్టుకొచ్చిగింజల్ని విసుర్తా రెక్కలు మొలుచుకొచ్చిన వెలుగునిచుక్కల చిక్కుల్లోంచి తప్పిస్తా వక నల్లమల కొండపైచీకటి గోడ్డళ్ళు వేటు వేస్తేవెలుతురును విరజిమ్మేసి పోతా..మీరు మళ్ళీ నన్ను తవ్వి పాతరేసేలోగా
జారిపోయిన నమ్మకం
దూరంనించి చూస్తేకొండ, జీవితం వక్కలాగే కనిపిస్తాయిదగ్గరికెళ్లకు భాయ్!బానపొట్ట కొండకొండచిలువ జీవితంజర పైలం బిడ్డా!నీడల్ని నమిల్న పట్టణంలైటు పోలు టూత్ పిక్ తోతీసిపారేసిన బిచ్చగాడి శవంచావులోనే నవ్వుకొంటోందివాడి చేతిముద్ద తిన్న కుక్క ఏడుస్తోందిఇనుప నాలిక మనిషొకడుఅమ్మ శ్రాద్ధంపిండాన్నిటొమొటో సాసులో అద్దుకొంటూమరో మానవ జన్మస్థానానికి…