ఆకలి మందగించినా బఫే భోజనాలు అన్నీ తినలేక పోయినా ఆలా కార్టే ఆర్డర్లు అంబరాన్నంటే అన్ని పండుగల సంబరాలు అబ్బురపరచే ఖర్చులు కేవలం కొన్ని క్షణాల కోసం వద్దంటే డబ్బు గవర్నమెంటు బాబులకు పద్దులు లేని మదుపులు రాజకీయ నాయకులకు హద్దులు దాటిన భ్రస్టాచారం…
నిశ్శబ్దం ఒక మౌన సంభాషణే!
చాలా మటుకు నిశ్శబ్ద ప్రవాహంలో నది ఉపరితలం పై తేలుతూ సాగిపోయే పూరెక్కలా మందగమనపు వయ్యారపు నడకలో సాగిపోతుంటాను. జలపాతాల అవిరళ సంగీత సాధనలూ నదీ నద ప్రవాహాల మృదుమధుర గీతాలూ కడలి తరంగాల కవ్వింపు బాణీలూ ఏమాత్రం నన్ను వశపరచుకోలేవు.…
మన్ చాహే గీత్
గాయం చేయనివాడు గాయకుడే కాదు మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది. “మన్ చాహే గీత్” … మహమ్మద్ ఖదీర్ బాబు వ్రాసిన…
నిమ్మపూరీలు
ఇవి తీపి పూరీలు. నిమ్మవాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటాయి. రుచిగా కూడా ఉంటాయి. కావలసిన పదార్థాలు: మైదాపిండి ఒక కప్పు చక్కెర ఒక కప్పు నెయ్యి ఒక కప్పు నిమ్మకాయలు రెండు ఉప్పు చిటికెడు వెన్న నిమ్మకాయంత …
అప్పుడప్పుడు…
చిరునవ్వుల పెదవులను తగిలించుకు చీకటి కన్నీళ్ళను గుండె గదిలో భద్రంగా దాచి ఉషోదయంతో పాటు ఉదయిస్తూంటాను. అయినా భావోద్వేగాల వల్లరిలో కొట్టుకు పోతూ అనిశ్చయత చెలియలికట్ట సంయమనాన్ని కోసేసినపుడు పట్టుకోల్పోయిన మనసు వరద వెల్లువవుతుంది కట్టలు తెగిన జీవనదిగా పొంగి పొర్లుతుంది.…
అంతర్యానం
అరమరికలు లేవనుకున్న ఆకాశానికే అడ్డుతెరల్లా ప్రశ్నల చినుకులు పర్వతంలా పరుచుకున్న విషాదపు నిషాలో ఆశ్రునిక్షిప్తమైన ఆకాశం నిండా అపశబ్దాలే. అర్ధంకాని అలజడి మధ్య ఆకాశం నిద్రపోతున్నదంటే నమ్మలేం! ఆగుతూ, సాగుతూ, పారుతున్న ప్రవాహంలో ఎవరి ఆత్మకథో రాలిపోయిన పూల నవ్వులా…
అర్థరాత్రి స్వతంత్రం
ఎంత గుహ్యం ఎంత మృగ్యం ఎంత చోద్యం ఎంత ఎంత చిత్రం అంతా కొందరి కోసం అరవైమూడు వసంతాల నిరీక్షణం ఇప్పటికింకా సాగునీరు లేని భూములు త్రాగు నీరు కోసం దూరాలకు నడకలు పట్టణాలలో పేదల ఇలాకాల్లో కుళాయిల వద్ద గొడవలు రహదారిపై…
నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే…
నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే గుప్పెడు క్షణాల్ని దోసిట్లో పోసి ఇక నీ ఇష్టం అని ఆమె చినుకుల్లో చినుకుగా మాయమైంది..ఈ క్షణాలు కరిగిపోయేలోగా అతడిని కలుసుకోవాలి… చుట్టూ కురుస్తున్న వర్షం…. కొండకోనల్లో వర్షం.. గుండె లోయల్లో వర్షం.. లోకంలోని కల్మషాన్నంతటినీ కడిగేస్తూ…
