“నా చుట్టే పల్లె మొత్తంవెల్లివిరిసిందని” ముచ్చటపడి మూగసాక్షిగానీదైన ధ్యాన ముద్రలో ఎండా, వాన, చలి,నునువెచ్చని హాయికి అతీతంగా, అలౌకికంగా అలరారే ఓ బొడ్డురాయీ!బడుద్దాయిలు ప్రవేశించారు నీ స్వప్నసీమలోబడబాగ్ని రగిలించారు. నీకు ఈశాన్యంలో ఉండిన సంప్రదాయందారితప్పిపోయింది…ఆ గుడితో సైతం ఆగ్నేయం వైపు…
Author: IVNS Raju
మనసు కాలమ్
రోజూ వెలుగులో పుట్టి చీకట్లో కలసిపోతోంది ఎండలోని వేడిని కొలుస్తుంది వానలోని చినుకుల్ని తడుముతుంది శీతకాలపు వణుకులో స్వరాల్ని పలికిస్తుంది శిశిరంలో రాలిపోయే ఆకుల్ని జోకొడుతుంది అంతలోనే వసంతమోహంతో కౌగిలించుకుంటుంది అత్యంత పురాతనమైనదే కానీ ఎప్పటికీ కొత్తదే మనిషి మనసులా!
గోదావరి
గోదావరి పేరు స్మృతుల సుడుల ఏరు సుమధుర భావాల తేరు గోదావరి తలపు మృత్యువు వరకూ మునక బతుకు రాయిపై చేరిక గోదావరి నడక ప్రకృతి పలకరింపుల స్పర్శ యద యద తో పరామర్శ గోదావరి తీరం తీరని హృదయ దాహానికి తార్కాణం…
కాలాతీతం!
కాలాన్ని కరిగించి కాలం చిక్కలేదని కాకి గోల చేస్తే కరుణించేదెవరు? రహదారుల పై కూడళ్ళ వద్ద కుంటుతూ సాగిపోయే ఖరీదైన కార్లు ప్రమాదకర వంకర్లు తిరుగుతూ ద్విచక్రచోదకులు కాలాన్ని వివిధ రీతుల వెచ్చిస్తూ వ్యధ చెందుతున్నారు జీవితం లో సింహభాగం పనికే అందులో…
వరద రాజకీయాలు
వరాలను దయచేయవు ఇవి వారాలకు పరదాలు వేసి చూపిస్తాయి పరదా తీస్తే అది వరం కాదని తెలుస్తుంది ఈలోగా మరో వరద వస్తుంది మొల లోతు నీళ్ళలో మనుషులు సహాయం కోరడం మార్చి మార్చి చూపిస్తాయి టీ వీలు వరదనీరుతొ…
రామ్ గోపాల్ వర్మ ‘భయం – భస్మం’
రాం గోపాల్ వర్మ కి భయానక రసం పై ఉన్న మక్కువ ఇంత అంతా కాదు అని తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన ఈ స్టొరీ లైన్ ఆధారం గా సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకొంటూ ఇది చదవండి.…
ఓ శనివారం సాయంత్రం
ఒక జంట బైక్ పై హత్తుకొని కూర్చొని ట్రాఫిక్ పద్మవ్యూహం ఛేదించుకొంటూ ఉత్సాహంగా ఊసులాడుతూ, ఊగిపోతూ ఒక సినిమాహాలు చేరి అక్కడి జనసంద్రంలో కలిసిపోయింది ఇంకా నేనున్నానని సాంప్రదాయం చెబుతున్నట్లు ఒక యువతి తలలో విరిసిన మల్లెలు ధరించి స్వచ్చతకు ప్రతిరూపంగా…
