Sweet Pudding & Carrot Cashew

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a> SWEET  PUDDING &amp;lt;a href=”http://www.bidvertiser.com”&amp;gt;pay per click&amp;lt;/a&amp;gt;Ingredients: 100 grams long-grain rice 2 litres milk 100 grams sultanas Caster sugar 200 ml single cream Flaked almonds to decorate…

నయా మ్యూజింగ్స్ – న.మో. మంత్ర

“నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో…ఓం నమో నమో నటరాజా నమోనమో నటతేజా” అని వీర బోల్డు పేరిణీ తాండవమైపోతున్నా. హెందుకో తెలీదుగానీ ఎల్లుండామధ్యన్నుంచీ డాన్సు చేసేసెయ్యాలనిపిచ్చేస్తోంది ఫాపం. ఎడంకాలు నిలబెట్టేసి కుడికాలు పైకెత్తేసేసి ఎడం చెయ్యి పైకి…

ఓ దీపమా!

 వెలుగుతో ఓ సంద్రాన్ని సృజియించి  అందు ముత్యమై మెరిసేవు నీవు!అలలేవని ఎవ్వరడిగేరు నిన్ను గాలి కూయలలూగేవు నీవు విత్తుకున్నది ఆదిగా! ప్రతి పుటలోనూ, కాంతి పూల పరిమళాన్ని ఆస్వాదిస్తూ నా మనసో వాసంత వాచకాన్ని చదువుతుంది నా కనుపాపలింట నీ వెల్గు…

చిటపటలు-27 “పిలక పీకుళ్ళు – రాజకీయాలు”

“అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు” అనే వ్యవహార వాక్యం పిలక రాజకీయాల్లో మారిపోయింది. ముందుగా కాళ్ళావేళ్ళా బడటం. మాట వినకపోతే పిలక పట్టుకు పీకటం. స్థూలంగా చెప్పుకుంటే ఇదీ పిలక రాజకీయమంటే! మన రాజకీయాల్లో “పిలక రాజకీయ శకానికి” నాంది పలికింది…

లోకం కోసం…

పండు ముదుసలి వగ్గులా ముడతలు పడ్డ దేహంతో ఆ చెట్టు   ఆకలేసిన కాకిలా ఆరో ఋతువు ఆకులన్నీ అద్దుకు తినేసింది   ఆకతాయిలకి అరవై చేతులతో వడ్డించిన ఆ చేతులు ఇప్పుడు బోసిపోతూ..   లేదనే మాటే తెలీని చెట్టు…

జన్మరహస్యం

కొత్తగా తెలిసిన జన్మరహస్యంఅక్కరలేని బిడ్డను దొప్పలొ పెట్టి నీళ్ళలో వదిలేయడం? ***వెలుతురు అంటని చీకట్లోనీళ్ళలో ముఖబింబం కనిపించదువ్యాపించే వెలుతురుతో బాటు నిజం మెలిపెడుతోంది. నిజాన్ని తన కడుపులోనే దాచేసితన ఒళ్ళోనే చనిపోయిన అమ్మ. “సూర్యదేవుడి అనుగ్రహంతెల్లటి కాంతితో, కుమ్మరివాడు మట్టితో బొమ్మని…

ప్లాట్‌ఫారం నెంబర్ వన్

రైలు వచ్చి నిలబడగానేఆ ప్లాట్‌ఫారం అమ్మకాల అరుపులౌతుందిపోర్టర్‌ల కేకలౌతుందిపలకరింపులు, వీడుకోలులు అక్కడే చిత్రంగా కలిపోతాయి ఎవరో సమోసా తింటూ..గాలికి వదిలిన కాగితం పొట్లంప్లాట్‌ఫారం టికెట్టు లేకుండానేస్టేషనంతా కలియ తిరుగుతుంది రైలు ఎక్కించే నెపంతోచేతులువేస్తున్న పెళ్ళికొడుకును చూసికొత్తపెళ్ళికూతురు సిగ్గుపడితేఅది మల్లెపూవై రాలి విచ్చుకుంటుంది…

దేవులపల్లి పాటకు రెండు గాత్రాలు

‘ఉండమ్మా బొట్టు పెడతా’ సినిమా 1968లో విడుదలైన మంచి చిత్రం. ఈ సినిమాలో కృష్ణ, జమున, జానకి, నాగభూషణం, ధూళిపాళ, ఇత్యాది తారాగణం ఉన్నారు. సంఘానికి  పునాది కుటుంబమే కనుక కుటుంబీకులు అందరూ క్రమశిక్షణతో, ఏకతాటిపై నడవాలి; సామరస్యంగా, సౌభ్రాతృత్వ, అనురాగాలకు అగ్రాసనం ఇవ్వాలి;…

కాకి దాహం

అనగనగా ఓ ఆంధ్రా కాకి. దానికి దాహం వేసింది. నీళ్ళకోసం తెలంగాణా, కోస్తా, రాయలసీమ జిల్లాలన్నీ వెతగ్గా, వెతగ్గా చివరకు మహారాష్ట్ర  సరిహద్దుల్లో ఒక కుండ కనిపించింది. కానీ, అందులో నీళ్ళు కాకికి అందనంత అడుగున వున్నాయి. ఆలోచించగా ఆలోచించగా కాకికి…

ఈ కాసిన్ని అక్షరాలు..

1.  శృంగేరిలో సూర్యాస్తమయం తుంగనది అనంతంలోకి.. ఓంకారం మౌనంలోకీ.. నదిలో చేపలు.. మదిలోనో? దేన్నీ పట్టుకోలేను చంటాడితో పాటు నాకూ కొన్ని కొత్త అక్షరాలు!? గుడిలో అమ్మ నవ్వుతుంది.   2. పాటే అక్కరలేదు ఒక్కోమాటు చిన్న మాటైనా చాలు జ్ఞాపకాల…