సొంత ఇంటి పరాయి 

  చాల రోజుల క్రితం నా ఇంటి పెరట్లోని చెట్టు కొమ్మమీద పక్షి గూడు అల్లింది – రోజు పాటల్లా కూసేది – కొంత కాలం లోక సంచారం చేసొచ్చాక గూడులేదు పక్షి లేదు చెట్టూలేదు ఆకస్మికంగా నా దేహం నీంచి…

కలల తీరాలు

  ఊహ తెలిసిన నాటినుండీ మనసు కలలు కంటూనే ఉంది అడుగడుగునా ఆనంద స్వప్న తీరాలు చేరుకోవాలని చిన్ని చిన్ని ఆశలనుండి జీవిత గమ్యాలు ఆపకుండా ముందుకు పరిగెట్టిస్తూనే ఉన్నాయి కోరిన నెలవులకు చేరిననాడు మరిన్ని తీరాలు దూరాన నిలిచి ఊరిస్తున్నాయి…

చంద్రుడి మచ్చలు

  ఎన్ని మహానదుల్లో మునుగుతున్నా చంద్రుడిలోని మచ్చలు పోవు ఎన్ని మబ్బులు కమ్ముకుంటున్నా ఆ నవ్వులోని స్వచ్ఛతా పోదు!   @@@@@

నిజంగానే!

వాడు రాత్రి బాటసారి అవతారమెత్తి చేదుపాట పాడుకొంటో సమస్యల్ని తోలుకొంటో అవతలి గట్టుకు వాడు మానవుడా? మిథ్యావాదా? ఆశాదూతా? ఋక్కుల్ని గంటలుగా మోగించుకొంటూ శైశవ గీతిని అద్వైతానికి అర్థంగా చెప్పుకొంటూ జ్వాలాతోరణాల్ని కట్ట చూస్తున్నవాడు ఉన్మాదా? భిక్షువా? సాహసా? నీడల్లో తేడాలుంటాయా?…

కాలగర్భంలో..

చర్మం పొరల్లో దాక్కున్న కాలం నిజాన్నో, అబద్ధాన్నో మోస్తూ ఉంటుంది గులకరాళ్ళ మౌనాన్ని మింగేసే సెలయేటి సవ్వడిలా పైపైనే ప్రవహించే కాలం ఇసుక తిన్నెల్లా ఆలోచనల్ని మిగిల్చి వెళుతుంది కణానికో కన్నును తెరిపించి శాపగ్రస్త దేవత కన్నీటి నవ్వును పంచరంగుల్లో చూపించే…

కవిత్వంలో కొత్తదనం

  “Everywhere I go I find that a poet has been there before me” -Sigmund Freud   దీన్నే రవి గాంచనిది కవి గాంచు అని అన్నారు మన పూర్వీకులు.  అమెరికన్ కవి ఆడెన్ మరింత విశిదంగా…

గ్రూప్‌ ఫోటో ముంగిట్లో . . .

అప్పుడప్పుడూ గ్రూప్‌ ఫోటో ముందు నిల్చున్నపుడు  కాలేజిదినాలొచ్చి చూపుల్తో కరచాలనం చేస్తాయి.  స్మృతుల బంధువులు వేలాడే మెదడు కొమ్మనై  స్నేహకెరటాల్ని మోసే నేత్ర సాగరాన్నై  మధుర ప్రకంపనల్ని వెలార్చే హృదయవీణా తంత్రినై  శబ్దాలతో కట్టిన నిశ్శబ్ద శిఖరాన్నై  గ్రూప్‌ ఫోటో ముందు…

మౌని

ఆకారంలేని మాటల్లో  సాకారంగా కనబడతాయి  ఊహలు  ఆశలు  భయాలు  బహువిధ బాధాతప్త  విదళిత హృదయాల  నిర్వాణ పర్వాల్లా  మాటలు…మాటలు…మాటలు  కండరాల మధ్య రాపిడే  నిండు జీవితాల్ని శాసిస్తోందని  తెలుసుకున్న నేడు  మాటలకు విలువనివ్వలేక పోతున్నాను !  *****

చెవుల్లేని చోట

నన్నుగాలిపటాన్నిచేసి ఎగరేసిందిసమాజం   నన్నో సముద్రాన్ని చేసి తీరం పక్కనే పెట్టింది సమాజం   చెట్టుకొమ్మలో ఇసుకపర్రలో నా గోల, నాకుమాత్రమే వినబడ్తోందా?   *****

ఇంతే!

ముఖ కవళికల్ని తెరచాటున దాచవచ్చు కన్నీటిలో కూడా కరగని భావాలుంటాయా? నిప్పులో మండని పదార్థాలుండొచ్చు నిజాల్ని ఒప్పుకోని మనసులుంటాయా?   మేఘాల స్పర్శను పొందుతున్నా వర్షించడం మర్చిపోయిన ఆకాశానికి మిగిలేది గతించిన జ్ఞాపకాలు మాత్రమే!