యింత ఖుషీ యెప్పుడూ దొర్కలా! యిరగ్గొట్టి, మంటెట్టిం తర్వాత యియ్యాలే తెలిసొచ్చెనా? నొప్పిలో సుఖముంటదిలేబ్బా! కాంక్రీటు మొండాల్తో యింగా యెన్నాళ్ళు నిలబడ్తార్లే యీ గుండె చాల్దా యేం? కయిత్వమైనా, కాంక్రీటైనా అరాచకత్వంలోనే వికసిస్తాయి
Category: సెలయేరు
Selayeru – Stream of poetry
అమ్మతనం
తనువుపై మార్పులు చూసి తన్మయం చెంది లోనుంచి శిశువు తన్నుతుంటే తాదాత్మ్యత పొంది మరణ సదృశ్యమైన ప్రసవ వేదన ని బిడ్డని చూడగానే ఆనందగా మార్చి ఇహ చాలు అని అనకుండా మరో బిడ్డకు తల్లవడానికి అదే ఉత్సాహంతో తన తనువును…
పునర్మిలనం
చెప్పాపెట్టకుండా వొకానొక సూదంటు ముల్లు లోన లోలోన మరీ లోలోని లోతుల్లోకి గుచ్చుతూ గుర్తు చేస్తోంటోంది! పిల్లల బొమ్మల అంగట్లో ప్రతి బొమ్మ స్పర్శలోనూ చేతివేళ్ళు కాలినంత జలదరింపు! అలిగిపోయిన తన ఆత్మ తనంతటనే తిరిగివొచ్చి గడప గొళ్ళెం…
మూతబడ్డ జీవితాలు
చచ్చినోళ్ళు ఫ్రేముల్లో బతికినట్లు నేను ఈ గోడల మధ్యన అతుక్కునుంటా బేల పెళ్ళాం చెంపల మీద బేవార్సు మొగుడి దెబ్బలా కడుపు మీద ఆకలి మడతలు పచ్చని చెట్ల మధ్యన ఇనుపస్థంబంలా వెర్రిగా రోడ్డులో దిగబడిపోతాను లైటు హౌసు దీపంలా ఉండాల్సిన…
నువ్వింకా గుర్తున్నావు!
ముల్లు గుచ్చుకున్నట్టు కళ్ళల్లో నీ కల జారిపోయిన మాటలా వెనక్కురాని ఆ క్షణం చుట్టూ ఎన్నో ఉన్నాయి ఐనా, ఒక్కసారైనా నీ మోము చూడాలనిపిస్తుంది బహుశా, నా ప్రాణాలు నీ కళ్ళలో దాగున్నాయేమో! కాలం నీపై చేసే ఇంద్రజాలాన్ని…
పోయినోళ్ళు
వాళ్ళెక్కడికీ వెళ్ళరు మనపైన అలిగి అలా మాటుగా కూర్చున్నారు, అంతే! చివరికి మనమే ప్రశాంతంగా వెతికి పట్టుకొంటాం వాళ్ళని!!
జలపాతం
ఆ జలపాతం ముందు దోసిలి పట్టుకుని ఎంతసేపుగా నిలబడ్డాను? నిండినట్టే నిండితిరిగి తన అస్తిత్వంలోకేఆవిరైపోతూ…కవ్విస్తూ… తడిసిన మనసు సాక్షిగాఅందీ అందని సంతకం కోసంతెల్ల కాగితం విరహించిపోతోంది అలుపెరుగని నృత్యానికి కూడాచలించని ఈ బండరాళ్ళలోకనీ కనిపించని చిరునవ్వేదోదోబూచులాడుతూ…చిక్కుముడి విప్పుతూ. మనిషి కందని రాగంతోసాగిపోతున్న…
మంచు
చలికాలపు సాయంత్రంఎవ్వరూ లేని బాట మీదఏకాకి నడక. రాలిన ఆకుల కిందఎవరివో గొంతులు ఎక్కడో దూరంగానిశ్శబ్దపు లోతుల్లోకిపక్షి పాట లోయంతా సూర్యుడుబంగారు కిరణాలు పరుస్తున్నాకాసేపటికి ఆవరించే చీకటి మీదకేపదే పదే మనసుపోతోంది కర్రపుల్లల కొసన నర్తించేఎర్రని చలిమంటలోకిప్రవేశించాలనిపిస్తోంది. కురిసే మంచునా గొంతులోఘనీభవిస్తోంది.…
తృప్తి
తడి మెరుపుల్లో కరిగిన చూపులు .. ఉరుము ధ్వనుల్లో మమైకమైన మౌనం .. జడివాన జల్లుల్లో.. జోరు గాలుల్లో.. వాడిన రెక్కమందారాలు ఎర్రబారిన చందమామను ఎదలోతుల్లో గుచ్చేసరికి ఏడడుగులు నడిచిన తృప్తి వెచ్చగా తాకింది. గుండెలపైన మరో రాత్రి బద్ధకంగా…
